SWATCHA ANDHRA: ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:06 AM
ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు. పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా స్వచ్ఛంధ్రా, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఉరవకొండ,ఫిబ్రవరి15(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు. పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా స్వచ్ఛంధ్రా, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. వైస్‌ప్రిన్సిపాల్ మస్తానయ్య, వెంకటరాముడు, పరమేష్, ఆదినారాయణ, ఐటీఐ కళాశాల శిక్షణాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, అధ్యాపకులు దుర్గాప్రసాద్, తిరుపతయ్య పాల్గొన్నారు.
గుత్తి:పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుత్తి కోట వద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప ఆధ్వర్యంలో స్వచ్చంధ్ర స్వచ్చదివాస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ పేపర్లు, చెత్తచెదారాన్ని తొలిగించారు.
కూడేరు: అంగనవాడీ కేంద్రంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి సూచించారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, ఏపీఓ తులసీప్రసాద్, సర్పంచు లలితమ్మ పాల్గొన్నారు.
శెట్టూరు: మండల ప్రత్యేకాధికారి ఆర్ సురేష్, ఎస్‌ఈఆర్‌డబ్ల్యూఎస్ రమేష్ నాయక్, ఎంపీడీవో రఘురామారావు, ఏఈ సురేంద్ర, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యాటకల్లు గ్రామంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
కుందుర్పి : స్థానిక ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో ఎంపీడీవో లక్ష్మీశంకర్, మండల విద్యాధికారి హెచఎ్‌స తిప్పేస్వామి పరిసరాలు పరిశుభ్రం చే శారు. కోఆర్డినేటర్ నాగేంద్ర, కార్యదర్శి మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
బ్రహ్మసముద్రం: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. ఎంపీడీవో నందకిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.
రాయదుర్గంరూరల్: స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ రఘురామమూర్తి మాట్లాడుతూ కళాశాల పనిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, బాబు పాల్గొన్నారు.
యల్లనూరు: మండలంలోని పలు కార్యాలయాల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఇనచార్జి ఎంపీడీఓ వాసుదేవరెడ్డి, పోలీ్‌సస్టేషనలో ఏఎ్‌సఐ సంపత సిబ్బందితో కలిసి కార్యక్రమం నిర్వహించారు.
గుంతకల్లుటౌన: పట్టణంలోని పలు వార్డుల్లో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ నయీమ్ ఆహ్మద్ మట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు.
బొమ్మనహాళ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటు ఆహ్లాదకరమైన రీతిలో ఉంటాయని ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓపీఆర్డీ దాస్ అన్నారు. మండల ప్రజాపరిషత కార్యాలయం వద్ద వారి కార్యక్రమాన్ని నిర్వహించారు.