Share News

Mla Palle సింధూరా.. సక్సెస్‌..!

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:39 AM

ప్రజాసమస్యలపై శాసనసభలో తన గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సక్సెస్‌ అయ్యారు.

Mla Palle సింధూరా.. సక్సెస్‌..!

పుట్టపర్తి రూరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలపై శాసనసభలో తన గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సక్సెస్‌ అయ్యారు. 15 రోజుల పాటు సాగిన శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబందించినవే కాకుండా.. రాష్ట్రంలోని సమస్యలనూ లేవనెత్తారు. ముఖ్యంగా.. నియోజకవర్గంలోని 193 చెరువులను, రెండు రిజర్వాయర్లను హంద్రీనీవా నీటితో నింపాలని, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పించాలని, కొత్తగా ఏర్పాటైన సత్యసాయి జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నూతన భవనాల నిర్మించాలని, తగిన సిబ్బందిని నియమించాలని, నాడు - నేడు పనులను పూర్తి చేయాలని, టిడ్కో గృహాలను పూర్తీ చేయాలని తదితర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘరామకృష్ణంరాజు, పలువురి మంత్రుల ప్రశంసలు అందుకున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:39 AM