NYAYADHIKARI : బాలల హక్కులను పరిరక్షిద్దాం
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:51 AM
బాలలను, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ధర్మవరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. మండలంలోని యర్రోనిపల్లిలో శనివారం ఆర్డీటీ, ధర్మవరంలీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

- సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి గీతావాణి
చెన్నేకొత్తపల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బాలలను, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ధర్మవరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. మండలంలోని యర్రోనిపల్లిలో శనివారం ఆర్డీటీ, ధర్మవరంలీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయాధికారి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ ప్రమీలకుమారి, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి పీవీ హరీశ, రామగిరి సీఐ శ్రీధర్, న్యాయవాదులు బాలసుందరి, చరణ్, హేమంత తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....