JC : ఈవీఎంలను పరిశీలించిన జేసీ
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:35 AM
జిల్లాకేంద్రంలోని పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న గోదాములలో భద్రపరిచిన ఈవీఎం లను జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ శనివారం తనికీ చేశారు. అదికారులు, రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో తలుపులు తీయించి ఈవీఎంలను పరిశీలించారు.

అనంతపురం టౌన, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న గోదాములలో భద్రపరిచిన ఈవీఎం లను జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ శనివారం తనికీ చేశారు. అదికారులు, రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో తలుపులు తీయించి ఈవీఎంలను పరిశీలించారు. అక్కడె ఎన్నిఉన్నాయి? వాటి భద్రత? తదితర విషయాలపై ఆరాతీసారు. లాక్‌బుక్‌లను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదని అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం అందరి సమక్షంలో తలుపులు వేయించి సీజ్ చేయించారు. కార్య క్రమంలో కలెక్టరేట్ సెక్షన ఆఫీసర్ యుగేశ్వరి, తహసీల్దార్ హరికుమార్, డీటీ కనకరాజు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు,
మరిన్ని అనంతపురం వార్తల కోసం....