Share News

POSTER : శ్రీరామ ఉత్సవ సమితి ఏర్పాటు

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:39 AM

శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర ఘాట్‌ అధ్యక్షుడు తిరువీఽ దుల జగదీష్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

POSTER : శ్రీరామ ఉత్సవ సమితి ఏర్పాటు
Poster release scene

అనంతపురం కల్చరల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర ఘాట్‌ అధ్యక్షుడు తిరువీఽ దుల జగదీష్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ సమితి కన్వీనర్‌గా దూపకుంట్ల శబరి వరప్రసాద్‌, కోకన్వీనర్లుగా గల్లా హర్ష, విశ్వనాథరెడ్డి, కోశాధికారిగా హితేన జైనను ఎంపిక చేశారు. సభ్యులుగా పీబీ రవికుమార్‌, బేకరి శ్రీనివాసులు, అజేష్‌ యాదవ్‌, అట్టె నరేంద్ర, బొబ్బా కిషోర్‌ నాయుడు, మల్లికార్జున, తోట సూర్య ప్రకాష్‌ను ఎంపిక చేశారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 6వ తేదీన నగరంలో నిర్వహించనున్న భారీ బైక్‌ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ర్యాలీలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రంగాచారి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ రాఘవేంద్ర, హిమకర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 23 , 2025 | 12:40 AM