BANANA : నిరాశ మిగిల్చిన అరటి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:30 AM
సిరులు కురిపించిన అరటి సాగు ప్రస్తుతం ఎండ తీవ్రకు బాగా దెబ్బతింటోంది. చెట్టు మీదనే అరటి గెలలు నల్లగా మారుతున్నాయి. ఎండలకు తోడు రాత్రి పూట చిన్న పాటి ఈదురు గాలులకు అరటి గెల బరువు వల్ల చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి. దీంతో పాటు అమాంతం ధరలు పడిపోవడంతో, కాయలను కోసే వ్యాపారులు లేక పోవడం వల్ల అరటి సాగుచేసిన రైతులు రూ. లక్షలు నష్టపోతున్నారు.

- ఎండలకు మాడుతున్న పంట
- అమాంతం పడిపోయిన ధర
- చెట్లు నేలకొరిగి నల్లగా మారుతున్న కాయలు
శింగనమల మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : సిరులు కురిపించిన అరటి సాగు ప్రస్తుతం ఎండ తీవ్రకు బాగా దెబ్బతింటోంది. చెట్టు మీదనే అరటి గెలలు నల్లగా మారుతున్నాయి. ఎండలకు తోడు రాత్రి పూట చిన్న పాటి ఈదురు గాలులకు అరటి గెల బరువు వల్ల చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి. దీంతో పాటు అమాంతం ధరలు పడిపోవడంతో, కాయలను కోసే వ్యాపారులు లేక పోవడం వల్ల అరటి సాగుచేసిన రైతులు రూ. లక్షలు నష్టపోతున్నారు. శింగనమల మండలంలోని నిదనవాడ గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి, నరేష్‌రెడ్డి అనే ఇద్దరు తమకున్న భూముల్లో ఈ సారి చెరో 3.50 ఎకరాల్లో అరటి సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే పంట కోత సమయంలో సరైన ధర లేకపోవడం వల్ల పంట కోనే వ్యాపారులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ రైతులు దిక్కులు చూస్తున్నా రు. పంట సాగు కోసం ఒక్కొ క్కరు దాదాపు రూ. ఆరు లక్షలు ఖర్చ పెట్టినట్లు వారు తెలిపారు. అయితే పంట కోత సమయంలో అత్యధిక ఉప్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఫలితం గా చెట్లు ఎండిపోతున్నాయి. కాయల నాణ్యత లోపించింది. దంతో పాటు అరటిగెల బరువు ఎక్కువ కావడంతో ఎండకు రాత్రి సమయంలో చిన్న పాటి గాలులకే అరటి చెట్లు నేలకు ఒరుగుతున్నాయి. దీంతో గెల నేలను తాకి కాయలు నల్లగా మారుతున్నాయి. ధరలు లేకపోవడం, కాయలు నల్లగా మారడంతో వ్యాపారులు కోనుగోలుకు ముందుకు రావడం లేదు. సాధారణంగా అరటి పంట జనవరి నెల నుంచి చేతికి వస్తుంది. జనవరి,ఫిబ్రవరి నెలల్లో టన్ను ధర రూ. 25 వేలు పలికింది. ప్రస్తుతం రూ.10 వేలు కూడా లేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం- శైలజ, ఉద్యానశాఖాధికారి
ఎండల కారణంగా ధరలు అమాంతం పడిపోయాయి. దూర ప్రాంతా లకు తరలించేందుకు వ్యాపారులు మోగ్గుచూపడం లేదు. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇతర రాషా్ట్రలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు పంటలు కోనుగోలు చేయడంతో ధరలు ఆశాజనకనంగా ఉండేవి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లకు మాత్రమే పంట తరలించే పరిస్థితి ఉంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....