COLLECTOR: ఎప్పటికప్పుడు నీటిని పరీక్షించాలి
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:10 AM
నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పే ర్కొన్నా రు. మండలంలోని ఆలమూరులో శనివారం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో నీటినాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

- కలెక్టర్ వినోద్‌కుమార్
్ఞఅనంతపురంరూరల్,మార్చి29(ఆంధ్రజ్యోతి): నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పే ర్కొన్నా రు. మండలంలోని ఆలమూరులో శనివారం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో నీటినాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో 14రకాల టెస్టులను చేపట్టినట్లు ఎస్‌ఈ తెలిపా రు. అన్ని రకాల టెస్టులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎస్‌ఈ సురేష్, వైద్యఆరోగ్యశాఖ డీపీఎం రవి శంకర్, ఆర్బీ ఎస్కే అధికారి నారాయణస్వామి, తహసీల్దార్ మోహన కుమార్, ఎంపీడీఓ దివాకర్, పంచాయతీ కార్యదర్శి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....