farmer. ప్రభుత్వం ప్రతి రైతునూ ఆదుకుంటుంది
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:36 AM
మండలంలో శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నష్టపోయిన అరటి, దానిమ్మ, మొక్కజొన్న రైతులను తమ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ భరోసా ఇచ్చారు.

తాడిమర్రి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నష్టపోయిన అరటి, దానిమ్మ, మొక్కజొన్న రైతులను తమ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ భరోసా ఇచ్చారు. మండలంలోని దాడితోట, తురకవారిపల్లి, నాయనపల్లి గ్రామాల్లో పంట నష్టాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. నష్టపోయిన పంట నష్టంపై ఇప్పటికే రెవెన్యూ,, హార్టీకల్చర్ అ ధికారులు అంచనా వేస్తున్నారన్నారు. ఏ రైతుకు అన్యాయం జరగకుండా నివేదికలను పంపాలని అధికారులను పరిటాల శ్రీరామ్ కోరారు. ఆయన వెంట ఏపీ సీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమ తం కాటమయ్య, టీడీపీ మండల కన్వీనర్ కూచిరాము, నాయకులు గోనుగుంట్ల భూషణ్, సాయి, బీసీ సెల్ నాయకుడు శ్రీనివాసులు, కొడిదెల రాజశేఖర్, రమణ, హర్షవర్దన పాల్గొన్నారు.