Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:20 AM
ఏపీ ప్రభుత్వం అబుదాబితో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెంపొందించేందుకు చొరవ చూపుతోంది. డీఆర్‌డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి అబుదాబి పర్యటనలో మంత్రి షేక్ నహ్యాన్‌ను కలిగి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో భాగస్వామ్యం పెంచేందుకు అబుదాబి ఆసక్తి చూపుతోంది.

అబుదాబి మంత్రితో సతీశ్‌రెడ్డి భేటీ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): గల్ఫ్ కూటమిలో కీలకమైన అబుదాబి ఎమిరేట్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పే ప్రయత్నాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి అబుదాబిలో ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అబుదాబి మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్‌ను ఆయన కోరారు. ఏపీలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో అబుదాబి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ తయబ్ కమాలీ పాల్గొన్నారు.