రఘురామ ‘క్వాష్’ పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:23 AM
మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

ప్రతివాది వకాలత్ వేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు గడువు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాది వకాలత్ వేసేందుకు గడువు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న బౌల్డర్ హిల్స్‌లోని రఘురామ నివాసం వద్ద ఒక వ్యక్తి(కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా) అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన అప్పటి ఎంపీ భద్రతా సిబ్బంది అతనిని పిలిచి విచారించగా, ఐడీ, ఆధార్ కార్డులు చూపించేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై రఘురామ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న తనపై నలుగురు వ్యక్తు లు దాడి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిేస్టబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా సైతం ఫిర్యాదు చేశారు. దీంతో రఘురామతోపాటు మరో నలుగురిపై కేసు నమోదైం ది. అయితే, తనతోపాటు తన కుమారుడు, ఇతరులపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ రఘురామ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రఘురామ సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, కానిస్టేబుల్ ఫరూక్ బాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఆయన తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి