Share News

క్రమశిక్షణతోనే అత్యున్నత స్థానం

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:13 AM

క్రమ శిక్షణతోనే విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకో గలరని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు పేర్కొన్నారు.

క్రమశిక్షణతోనే అత్యున్నత స్థానం

పెద్దదోర్నాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): క్రమ శిక్షణతోనే విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకో గలరని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎన్‌.సావిత్రి ఆధ్వర్యంలో వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూవిద్యార్థులు జీవితలక్ష్యాన్ని చేరుకోవా లంటే గురువుల పట్ల అంకితభావం ఉండాలన్నారు. తల్లిదండ్రులను ప్రేమించాలని, నిబద్ధతతో శ్రద్ధగా చదవాలన్నారు. అదేవిధంగా కళాశాల నూతనంగా మంజూరు కావడంతో పలు సమస్యలు వేధిస్తున్నా యని కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కా రానికి, కలెక్టర్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదికలు పంపించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్‌యార్డులో కళాశాలకు సరిపడే స్థలసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. శాశ్వత భవన నిర్మాణాలకు, హాస్టల్‌ వసతి ఏర్పాటుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాలలో విద్యానైపుణ్యాలు ప్రదర్శించిన విద్యార్ధులకు ప్రశంసాపత్రాలు అందజే శారు. కార్యక్రమంలో స్టేట్‌బ్యాంకు మేనేజరు సురేష్‌బాబు, సర్పంచి చిత్తూరి హారిక, మాజీ సర్పం వెచ్చా హరగోపాల్‌, టీడీపీ నాయకులు షేక్‌ మాబు, దొడ్డా.శేషాద్రి, చంటి, చల్లా వెంకటేశ్వర్లు, షేక్‌ మంజూర్‌ భాష, కే సుబ్బారెడ్డి, దేవయ్య పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : ముస్లిం మైనార్టీల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. స్థానిక కొత్త మస్జీద్‌ వద్ద టీడీపీ మండల ముస్లిం మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన ముస్లింలకు ముందస్తు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింలకు టీడీ పీ ద్వారానే మేలు జరుగు తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్‌ మహబూబ్‌బాష, షేక్‌ సమ్మద్‌బాష, షేక్‌ మంజూర్‌బాష షేక్‌.మౌలాలి, షేక్‌ రఫీ, ఖాన్‌, ఇస్మాయిల్‌, బాష, బట్టు సుధాకర్‌రెడ్డి, దొడ్డా శేషాద్రి, చంటి, చల్లా వెంకటేశ్వర్లు, ఎలకపాటి చెంచయ్య, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 01:14 AM