వణికిస్తున్న మూగజీవాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:01 AM
మండలం లోని పలు గ్రామాల్లో మూగ జీవాలు బెడద ఎక్కువైంది. కుక్కలు, కోతులు, ఆవులు గుంపులు, గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. వీటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టక పోవడం తో నిత్యం ఏదొక ప్రాంతంలో దాడులకు తెగబడు తున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు ధైర్యంగా తిరగ లేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎటువైపు నుం చి కుక్కలు, కోతులు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి కొనసాగుతుంది. ఇళ్ల ముందు పిల్లలు ఆడుకుంటే చాలు ఒక్క మాటున మీద పడి గాయపరుస్తున్నాయి.

స్థానికులు, పశువులను గాయపరుస్తున్న ఊరకుక్కలు
ఇళ్లలో వస్తువులను ఎత్తుకెళుతున్న వానరాలు..
అడ్డుకుంటుంటే దాడులు
రహదారిపై తిష్ట వేస్తున్న గోవులు
గ్రామాల్లో తిరుగుతూ పరిశుభ్ర వాతావరణాన్ని అపరిశుభ్రం చేస్తున్న పందులు
ఇబ్బందుల్లో గోకవరం వాసులు
గోకవరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మండలం లోని పలు గ్రామాల్లో మూగ జీవాలు బెడద ఎక్కువైంది. కుక్కలు, కోతులు, ఆవులు గుంపులు, గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. వీటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టక పోవడం తో నిత్యం ఏదొక ప్రాంతంలో దాడులకు తెగబడు తున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు ధైర్యంగా తిరగ లేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎటువైపు నుం చి కుక్కలు, కోతులు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి కొనసాగుతుంది. ఇళ్ల ముందు పిల్లలు ఆడుకుంటే చాలు ఒక్క మాటున మీద పడి గాయపరుస్తున్నాయి. ద్విచక్ర వాహనదారుల వెంట పడి తరు ముతున్నాయి. రాత్రి వేళ కుక్క లకు మనుషులు కనిపిస్తే చాలు మీదకు దూకుతున్నాయి. ము ఖ్యంగా మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపడిపోతున్నా రు. పశువులను కూడా తీవ్రంగా గాయపరిచిన సందర్భాలు న్నాయి. కోతులు గుంపులుగా ఇళ్లపై పడుతున్నాయి. గృహల్లోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళుతు న్నాయి. ఆ సమయంలో అడ్డుపడే ప్రయత్నం చేస్తుంటే మీదకు ఉరికి దాడులకు యత్నిస్తున్నాయి. నిత్యం వందలాది కోతులు ని వాస గృహల మధ్యే తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గోకవరంలో పశువుల సంచారం రాత్రి, పగ లూ తేడా లేకుండా సంచరిస్తు న్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిపై అడ్డదిడ్డంగా తిరగ డం, ఒకేచోట గుంపుగా సేద తీర్చుకోవడం చేస్తున్నాయి. దీని వల్ల వాటిని తప్పించుకొని వెళ్లే సమయంలో వాహనదారులు ప్రమాదబారిన పడి గాయపడుతున్నారు. ఒక్కోసారి అవి పొట్లా టకు దిగి సమీపంలో ఉన్న దుకాణాల్లోకి చొరబడి నష్టం చేయడంతో పాటు, అటుగా వెళ్లే వాహన దారులపై పడి గాయపరుస్తున్నాయి. ఈ విష యంలో అధికారులకు స్థానికులు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండడం లేదు. పం చాయతీ అధికారులు కూడా యజమానులకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వారూ చెవికి ఎక్కించుకోవడం లేదు. గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో పందులు గుంపులుగా తిరుగుతూ పరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అపరిశుభ్రం చేస్తున్నాయి. మురుగు కూపాల్లో దొర్లుతూ జనవాసాలు మధ్య కలియ తిరగడం వల్ల ఎటువంటి అనారోగ్యం బారిన పడతామోనని స్థానికులు భయభ్రాంతు లకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూగజీవాల బారి నుంచి ప్రజలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.