Share News

AP Fibrenet Scam: ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ల ప్రక్షాళన!

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:58 AM

ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డుల్లో జరిగిన అనైతిక నియామకాలను సమీక్షించి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కీలక ఉద్యోగాల నియామకాలు తాడేపల్లి ప్యాలెస్‌ సిఫారసుల మేరకు జరిగాయని, కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

AP Fibrenet Scam: ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ల ప్రక్షాళన!

రెండు కీలక కమిటీల ఏర్పాటు

నియామకాలపై లోతైన పరిశీలన

కొత్త నియామకాలు చేపట్టే అధికారం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. వైసీపీ హయాంలో ఈ రెండు బోర్డులలోనూ జరిగిన నియామకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా వీటిని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డుల్లో కీలక విభాగాల్లో బాథ్యతలు నిర్వహిస్తున్నవారిని ఎవరు సిఫారసు చేశారో.. వారు నిర్వహిస్తున్న బాధ్యతలు ఏమిటో సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయల శాఖ కార్యదర్శి యువరాజ్‌ నేతృత్వంలో రెండు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు గతంలో చేపట్టిన నియామకాలను సమీక్షించనున్నాయి. అదేవిధంగా కొత్తగా చేపట్టే నియా మకాలకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడంతోపాటు నియామక పత్రాలు అందించనున్నాయి. ఇలా రెండు సంస్థలూ ఉద్యోగుల నియామకాలపై లోతైన సమీక్ష చేయడం ద్వారా ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డులను ప్రక్షాళన చేయనున్నాయి. ఫైబర్‌ నెట్‌ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఐ అండ్‌ ఐ, ఐటీశాఖ కార్యదర్శి, ఏపీఈడీసీ సీఈవో, ఎపీఐసీఎల్‌ ఎండీ, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో ఉంటారు. అదేవిధంగా మారిటైమ్‌ బోర్డులో కీలక నియామకాల కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో, ఎండీ ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌, ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీలతో కూడిన కమిటీని నియమించారు.


ఇవీ ఆరోపణలు

ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డుల్లో కీలక ఉద్యోగాల నియామకాలు తాడేపల్లి ప్యాలెస్‌ సిఫారసుల మేరకు జరిగాయని.. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి, వైసీపీ ఎంపీలు వాట్సప్‌ ద్వారా సిఫారసు చేసిన వారందరికీ ఫైబర్‌ నెట్‌, ఏపీ మారిటైమ్‌ బోర్డులో ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో కొందరు ఐదేళ్లుగా ఉద్యోగాలకు రాకున్నా.. నెలనెలా జీతాలను చెల్లిస్తూ వచ్చారు. ఈ నియామకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఫైబర్‌నెట్‌ అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్‌ దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డులలో ప్రక్షాళనకు నోచుకోకపోవడంపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఫైబర్‌నెట్‌, మారిటైమ్‌ బోర్డుల ప్రక్షాళనకు ప్రభు త్వం కసరత్తు ముమ్మరం చేయడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 03:58 AM