Rushikonda Beach: రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ బృందం
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:28 AM
బీచ్‌లో కుక్కలు తిరుగుతున్నాయని, పార్కింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మౌలిక వసతులు కొరవడ్డాయని ఫొటోలతో సహా ఫిర్యాదులు వెళ్లడంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం బ్లూ ఫ్లాగ్ కమిటీకి లేఖరాసి పరిశీలనకు రావాలని, గుర్తింపును పునరుద్ధరించాలని కోరింది.

విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండ బీచ్‌ను శుక్రవారం బ్లూ ఫ్లాగ్ బృందం పరిశీలించింది. బీచ్‌లో కుక్కలు తిరుగుతున్నాయని, పార్కింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మౌలిక వసతులు కొరవడ్డాయని ఫొటోలతో సహా ఫిర్యాదులు వెళ్లడంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం బ్లూ ఫ్లాగ్ కమిటీకి లేఖరాసి పరిశీలనకు రావాలని, గుర్తింపును పునరుద్ధరించాలని కోరింది. దీంతో ఢిల్లీ నుంచి అజయ్ సక్సేనా, శ్రీజి కురూప్ విశాఖ వచ్చి శుక్రవారం బీచ్‌ను పరిశీలించారు. ఈ బృందం శనివారం కూడా బీచ్‌ను పరిశీలించి నివేదిక సమర్పిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే