Police Operation : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:53 AM
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు.

8 మంది మావోయిస్టులు మృతి
భారీగా ఆయుధాలు లభ్యం
కొనసాగుతున్న కూంబింగ్
చింతూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బీజూపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి తోడ్కా అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్ డివిజన్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు గుమిగూడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెనువెంటనే వెయ్యిమందికి తగ్గకుండా డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వు ఫోర్స్, కోబ్రా 202 బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌కు బయలుదేరాయి. మావోయిస్టులు గుమిగూడి ఉన్న ప్రదేశానికి చేరుకున్న బలగాలు వారికి మూడు వైపులా కేంద్రీకరించి కాల్పులకు దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం మొదలైన ఆపరేషన్ శనివారం సాయంత్రానికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బలగాలు 8మంది మావోయిస్టుల మృతదేహాలు కనుగొన్నాయి. వాటితోపాటు అక్కడ పడిఉన్న పేలుడు సామగ్రి, తుపాకీలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్‌కు వెళ్లిన బలగాల్లో కొందరు మావోయిస్టుల మృతదేహాలను బీజాపూర్‌కు తరలించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News