తిరుపతి జిల్లాకు పురస్కారాల పంట
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:29 AM
ఈ ఉగాదికి తిరుపతి జిల్లాకు పురస్కారాల పంట పండింది. సాహిత్య, కళా రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళారత్న హంస పురస్కారాలు జిల్లాలో ఏడుగురిని వరించాయి. సాహిత్యంలో వి.ఆర్.రాసాని, ఆముదాల మురళి, కంపల్లె రవిచంద్రన్‌లకు ప్రకటించగా, సంగీతంలో ద్వారం లక్ష్మి, సాదుల మునిరత్నంలు కళారత్నలు అందుకోబోతున్నారు.

ఈ ఉగాదికి తిరుపతి జిల్లాకు పురస్కారాల పంట పండింది. సాహిత్య, కళా రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళారత్న హంస పురస్కారాలు జిల్లాలో ఏడుగురిని వరించాయి. సాహిత్యంలో వి.ఆర్.రాసాని, ఆముదాల మురళి, కంపల్లె రవిచంద్రన్‌లకు ప్రకటించగా, సంగీతంలో ద్వారం లక్ష్మి, సాదుల మునిరత్నంలు కళారత్నలు అందుకోబోతున్నారు. సామాజిక సేవా రంగంలో కిరణ్‌కాంత్ చౌదరికి కళారత్న ప్రకటించారు. నృత్య కళాకారులు ఎస్.ఉషారాణి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఆకుల మల్లేశ్వరరావు(సాహిత్యం), ముని మల్లికార్జున(సంగీతం), శ్రీవాణి ఎల్లా(సంగీతం), టి.పురుషోత్తం నాయుడు(జర్నలిజం)లు ఉగాది పురస్కారాలు అందుకుంటున్నారు.