మొదలైన టెన్త్ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:29 AM
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ తొలి రోజైన గురువారం ప్రశాంతంగా మొదలైంది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో, క్యాంపు అధికారి డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో పరీక్షల సహాయ కమిషనర్, ఏడీ వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ జరిగింది.

చిత్తూరు సెంట్రల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ తొలి రోజైన గురువారం ప్రశాంతంగా మొదలైంది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో, క్యాంపు అధికారి డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో పరీక్షల సహాయ కమిషనర్, ఏడీ వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ జరిగింది. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఉదయం 8 గంటలకు రిపోర్టు చేశారు. మధ్యాహ్నం వరకు ఆయా సబ్జెక్టుల వారీగా విధులు కేటాయిస్తూ, ఐడీ కార్డులు అందజేశారు. మధ్యాహ్నం నుంచి అన్ని సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉండగా, తొలిరోజున ఒక్కో ఏఈ 20 జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు, శుక్రవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరంగా మూల్యాంకనం జరుగుతుందని డీఈవో వివరించారు. విధుల్లోని ప్రతి ఒక్కరూ ఐడీ కార్డులు తప్పని సరిగా ధరించాలని, సెల్‌ఫోన్లు ఏ ఒక్కరూ వాడరాదని ఆమె హెచ్చరించారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం సైతం స్థానిక పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలోని ఒకేషనల్ భవన్‌లో ప్రారంభమైంది.