Share News

Travis Head SRH IPL 2025: హెడ్ ఊచకోత.. బౌలర్లకు నిద్రలేకుండా చేశాడు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:23 PM

SRH vs RR 2025: ఐపీఎల్ నయా సీజన్‌ను తమదైన స్టైల్‌లో స్టార్ట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోతోంది కమిన్స్ సేన.

Travis Head SRH IPL 2025: హెడ్ ఊచకోత.. బౌలర్లకు నిద్రలేకుండా చేశాడు
Travis Head

ఐపీఎల్ కొత్త సీజన్‌‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమదైన టచ్ ఇస్తోంది. ఎప్పటిలాగే అటాకింగ్ మోడ్‌లో ఆడుతున్నారు ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు పోయిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కమిన్స్ సేన.. తొలి బంతి నుంచే దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 63 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 21 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఒక్కో బౌలర్‌ను టార్గెట్ చేసి మరీ బాదాడీ విధ్వంసకారుడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు.


విధ్వంసానికి పరాకాష్ట

రాజస్థాన్ బౌలర్లకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు హెడ్. ఫోర్లు, సిక్సులతో పట్టపగలే వాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటిదాకా 8 బౌండరీలు కొట్టిన ఈ రాక్షసుడు.. 3 సిక్సులు బాదాడు. 217 స్ట్రైక్ రేట్‌‌తో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 33 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ 9.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 126 పరుగులతో ఉంది. అన్ని ఓవర్లు పూర్తయ్యేసరికి 230 పరుగుల వరకు టార్గెట్‌ను ఆరెంజ్ ఆర్మీ సెట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ లాంటి హిట్టర్లు ఉన్నారు కాబట్టి ఇంకా భారీ స్కోరు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


ఇవీ చదవండి:

కమిన్స్ వార్నింగ్.. దమ్ముంటే ఆపమంటూ..

నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాలాక్కెళ్తారు: ధోనీ

ఉప్పల్‌లో బ్లాక్ టిక్కెట్ల దందా.. పోలీసులను చూసి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2025 | 04:30 PM