Motilal Oswal: ఇందుకే రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు: మోతీలాల్ ఆస్వాల్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:26 PM
రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం దీర్ఘకాలిక పెట్టుబడులను పక్కన పెట్టి స్వల్పకాలిక రాబడుల కోసం ట్రేడర్లుగా మారుతుండటమే నష్టాలకు కారణమని మార్కెట్ నిపుణులు మోతీలాల్ ఆస్వాల్ అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌పై దృష్టి పెట్టడం ఆందోళనకరమని మార్కెట్ నిపుణుడు, మోతీలాల్ ఆస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఎమ్‌డీ, సీఈఓ మోతీలాల్ ఆస్వాల్ అ్నారు. నానాటికీ ఒడిదుడుకులు ఎక్కువవుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇలాంటి వారు నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్టాక్‌మార్కట్ తీరుతెన్నులపై జాతీయ మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టా్క్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన వారే ఎక్కువగా లాభాలు పొందారని మోతీలాల్ అన్నారు. అయితే, ఇలాంటి వారి సంఖ్య భారత్‌లో స్వల్పమని ఇది చాలా ఆందోళనకరమని అన్నారు.
‘‘మార్కెట్ మౌలిక సూత్రాలను ప్రజలు మర్చిపోయారు. ఇక్కడ సరైన సమయంలో సరైన కంపెనీలు లేదా ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులతో మాత్రమే డబ్బులు సంపాదించొచ్చు. జనాలు చాలా మంది ట్రేడర్లుగా మారిపోయారు. ఇదే అతి పెద్ద సమస్య’’ అని మోతీలాల్ అభిప్రాయపడ్డారు.
Also Read: బంగారు నగలను అమ్మేస్తున్నారా? ఎంత నష్టపోతున్నారో తెలిస్తే..
రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతుండటంపై కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 26 శాతం భారతీయ కుటుంబాలకు స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టాయని అన్నారు. కానీ కొత్తగా పెట్టుబడి పెట్టేవారందరూ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలకంటే సత్వర ఆర్జనపై దృష్టి పెడుతున్నారని అన్నారు. తమకు అంతగా తెలియని కంపెనీల్లో పెట్టుబడులతో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు పాల్పడుతూ చాలా సందర్భాల్లో నష్టాల పాలవుతున్నారని అన్నారు. ఇక వచ్చే రెండేళ్లల్లో మార్కెట్ వృద్ధి 10 నుంచి 15 శాతానికి పరిమితం అవుతుందని కూడా ఆయన అంచనా వేశారు.
Also Read: భారత్‌తో పోలిస్తే దుబాయ్ బంగారం ధర ఎందుకు తక్కువంటే..
ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు మెల్లగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. భారతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయని అయన అన్నారు. భౌగోళిక రాజకీయ పరిణామాలతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి కావడం కూడా ఈ పరిస్థితి కారణమని అననారు. ఒడిదుడుకుల మాట ఎలా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ పునాదులు మాత్రం పటిష్ఠంగా ఉన్నాయని స్పష్టం చేశారు.