Share News

CM Chandrababu Naidu: నీకో సగం... నాకో సగం!’

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:20 AM

ఈసారీ మనవడి పేరున ఒకరోజు అన్నప్రసాద వితరణ విరాళం రూ.44 లక్షలను అందించారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఆ తర్వాత వారు కూడా అన్నప్రసాదం స్వీకరించారు.

CM Chandrababu Naidu: నీకో సగం... నాకో సగం!’

అన్న ప్రసాదంలో వడ పంచుకున్న చంద్రబాబు దంపతులు

మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ప్రతి ఏడాదిలాగే.. ఈసారీ మనవడి పేరున ఒకరోజు అన్నప్రసాద వితరణ విరాళం రూ.44 లక్షలను అందించారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఆ తర్వాత వారు కూడా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సిబ్బంది వడ వడ్డించబోగా... చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తొలుత వద్దన్నారు. అన్న ప్రసాదంలో ఇటీవలే వడ ప్రవేశపెట్టిన సంగతి చంద్రబాబు ఆమెకు చెప్పారు. తనకు ఒక ముక్క మాత్రం ఇవ్వాలన్నట్లుగా సిబ్బందికి సైగ చేశారు. దీంతో భువనేశ్వరి ఒక వడను చంద్రబాబుకు వేయించారు. తర్వాత దానిని తీసుకుని రెండు ముక్కలు చేసి, సగం చంద్రబాబుకు ఇచ్చి, మిగిలిన సగం తాను ఆరగించారు.

Updated Date - Mar 22 , 2025 | 04:20 AM