కనెక్షన లేక కష్టాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:54 PM
రైతులకు కరెంట్ కనెక్షన్ల సమస్య శాపంగా మారింది. నంద్యాల జిల్లాలోని మూడు డివిజనల పరిఽధిలో 29 మండలాలలో సుమారు లక్షల ఎకరాలు భూమి సాగులో వుంది.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రైతులకు కష్టాలు
విద్యుత క నెక్షన్ల కోసం రైతుల ఎదురు చూపులు
నంద్యాల కల్చరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రైతులకు కరెంట్ కనెక్షన్ల సమస్య శాపంగా మారింది. నంద్యాల జిల్లాలోని మూడు డివిజనల పరిఽధిలో 29 మండలాలలో సుమారు లక్షల ఎకరాలు భూమి సాగులో వుంది. కాలువల్లో, బోర్లలో నీరు పుష్కలంగా వున్నప్పటికీ విద్యుత కనెక్షన్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,05,235 వ్యవసాయ కనెక్షన్లు వున్నాయి. 1.10.2024 నుంచి 19.3.2025 వరకు 172 వ్యవసాయ కనెక్షన్లు రిలీజ్ చేశారు. వీటితో మొత్తం వ్యవసాయ కనెక్షన్లతో కలిపి 19.03.2024 వరకు 1,05,707 కనెక్షన్లు వున్నాయి. ఈ సంవత్సరం 19.03.2024 నుండి ఇప్పటి వరకు 11,551 మంది రైతులు వ్యవసాయ విద్యుత కనెక్షన్ల కోసం అప్లై చేసుకున్నారు. కానీ వీటిలో పైకం చెల్లించిన వారు 4,756 మంది వున్నారు. వీరికి కూడా విద్యుత కనెక్షన ఇప్పటి వరకు ఇవ్వలేదు. వీరు తమకు ఎప్పుడు కరెంట్ కనెక్షన ఇస్తారని ఎదురుచూస్తున్నారు. డబ్బులు కట్టిన రైతులకే ఇవ్వలేదని, తాము డబ్బులు కట్టలేదని మిగతా రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే విద్యుత కనెక్షన్లకు అవసరమైన మెటీరియల్ అందలేదని విద్యుత అధికారులు చెబుతున్నారు. మెటీరియల్ అనగా ట్రాన్సఫార్మర్, కండక్టర్స్, కేబుల్స్. 25 కిలోవాట్ ఒక ట్రాన్సపార్మర్ ఖరీదు రూ.2,50,000 అవుతుందని అధికారులు చెప్పారు. ఒక్కొక్క రైతుకు 2 కిలోవాట్ ప్రకారం కేటాయిస్తే దాదాపుగా పొలాలు దగ్గర వున్నవారికి విద్యుత ఇవ్వవచ్చు. కానీ ఇక్కడే తిరకాసు వుంది. పొలం వద్ద నుంచి ట్రాన్సఫార్మర్ వరకు విద్యుత స్తంబాలు, కేబుల్స్ అధికారులు ఎస్టిమేషన వేసి రైతుల నుంచి అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు.
ఫ మెటీరియల్ ఇప్పుడిప్పుడే వస్తోంది- ఎస్‌ఈ, సుధాకర్‌కుమార్
గత నెలరోజుల నుంచి మెటీరియల్ వస్తున్నది. వచ్చినదాన్ని వచ్చినట్లుగా రైతులకు సరఫరా చేస్తున్నాం. 25 కిలోవాట్స్ ట్రాన్సఫార్మర్ దాదాపు రూ.2,50,000 అవుతుంది. రైతులు సమూహంగా వస్తే సర్వే నిర్వహించి రైతులకు అందజేస్తాము. రైతులకు 9గంటలు విద్యుత సరఫరా చేస్తున్నాం. అలాగే రైతులు కోరిన విధంగా 22కెవి ఫీడర్స్‌ను 2 స్పెల్‌గా కూడ విద్యుత అందిస్తున్నాం.