Tirumala Papavinasanam Dam: ‘పాపవినాశనం’ డ్యాంలో బోటింగ్..!
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:48 AM
తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌కు సంబంధించిన వివాదం చెలరేగింది. భక్తుల తాగునీటిలో బోటింగ్ ఎలా అనుమతిస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇది చట్టవ్యతిరేక కార్యకలాపాల పరిశీలన కోసం చేసినదని వెల్లడించారు.

ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యాటకమా అంటూ విమర్శలు
ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యాటకమా అంటూ విమర్శలు
తిరుమల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. భక్తుల తాగునీటిలో బోటింగ్ చేయడం ఏమిటి?’ అంటూ భక్తులు విమర్శిస్తున్నారు. కాగా, పాపవినాశనం డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగుతున్నట్టు సమాచారం రావడంతోనే.. తనిఖీ చేయడానికి ఈ పడవలు ఉపయోగించామని జిల్లా అటవీ అధికారి వివేక్ వెల్లడించినట్టు టీటీడీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ