Share News

Ravindra Reddy TDP controversy: నాడు బూతులు తిట్టి.. నేడు లోకేశ్‌తో భేటీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:51 AM

టీడీపీ నేతలపై గతంలో అసభ్యకర పోస్టులు చేసిన ఇప్పాల రవీంద్రరెడ్డి, మంత్రి లోకేశ్‌ను కలవడం వివాదాస్పదమైంది. సిస్కోతో నైపుణ్య అభివృద్ధి ఒప్పందం సందర్భంగా జరిగిన ఈ సమావేశంపై టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోకేశ్, సిస్కో ప్రతినిధులతో మాట్లాడి రవీంద్రరెడ్డి ఏపీ ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకున్నారు.

Ravindra Reddy TDP controversy: నాడు బూతులు తిట్టి.. నేడు లోకేశ్‌తో భేటీ

మంత్రిని కలిసిన సిస్కో బృందంలో వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు రవీంద్రరెడ్డి

గతంలో చంద్రబాబు, లోకేశ్‌, ఇతర టీడీపీ

నేతలపై అసభ్య పోస్టులతో చెలరేగిన ఇప్పాల

అలాంటి వ్యక్తి మంత్రిని కలవడంపై రచ్చ..

సోషల్‌ మీడియాలో మండిపడ్డ కార్యకర్తలు

విషయం తెలుసుకొని సీరియస్‌ అయిన లోకేశ్‌

సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎ్‌సడీ లేఖ

ఏపీ ప్రాజెక్టుల్లో దూరం పెట్టాలని సూచన

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులతో చెలరేగిన ఇప్పాల రవీంద్రరెడ్డి.. మంత్రి నారా లోకేశ్‌ను కలవడం వివాదాస్పదమైంది. రాష్ట్రంలో ఐటీ, అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ను కలిసిన సిస్కో బృందంలో ఆ కంపెనీ టెరిటరీ సేల్స్‌ మేనేజర్‌గా ఉన్న రవీంద్రరెడ్డి హాజరవడమే కాకుండా.. ఈ సమావేశ సమన్వయ బాధ్యతలను కూడా ఆయనే చూడడంపై వివాదం రేగింది. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా రవీంద్రరెడ్డి నిజస్వరూపాన్ని బయట పెడుతూ పోస్టులు పెట్టారు. కొందరు పార్టీ నేతలు ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సుల్లో ఉన్న మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడి, రవీంద్రరెడ్డి ఇకపై ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా చూడాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.

50 వేల మందికి నైపుణ్య శిక్షణ సిస్కోతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఎంవోయూ జరిగింది. ఒప్పందంలో భాగంగా విద్యార్థుల్లో డిజిటల్‌ నైపుణ్యాలను విస్తరింపజేసేందుకు నెట్‌వర్కింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ తదితర అంశాల్లో ఆ సంస్థ కంటెంట్‌ అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కోన శశిధర్‌, జి.గణే్‌షకుమార్‌, కె.దినే్‌షకుమార్‌, సిస్కో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దేడ్రిచ్‌ తదితరులు పాల్గొన్నారు.


వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు

లోకేశ్‌ ఆదేశాలతో మంత్రి ఐటీ విభాగం ఓఎ్‌సడీ సాయి చైతన్య సిస్కో యాజమాన్యానికి ఘాటు లేఖ రాశారు. గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్రరెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులు సేకరించి, దానికి జత చేశారు. సిస్కోతో ప్రయాణాన్ని తాము గౌరవిస్తామని చెబుతూనే.. రవీంద్రరెడ్డి నేపథ్యంపై విరుచుకుపడ్డారు. ఆయన గతంలో సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలిపారు. రాజకీయంగా వ్యక్తిగత అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కానీ మరీ దిగజారి ఎదుటి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సహించరాని విషయమని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తాము భావించడం లేదని, ఈ ప్రాజెక్టుతోపాటు ఏపీలో చేపట్టేబోయే ఏ ప్రాజెక్టులోనూ అతన్ని భాగస్వామిగా చేయవద్దని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Updated Date - Mar 26 , 2025 | 03:51 AM