Riyadh: రియాధ్‌లో భారతీయ కార్మికులకు భోజన సామగ్రిని అందించిన తెలుగు ఎన్నారైలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:24 PM
రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా సెంట్రల్’ రంజాన్ ఆహార సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఒక మూతపడ్డ కార్మాగారంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ కార్మికుల మధ్య ఇటీవల నిర్వహించింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో ఇఫ్తార్ విందును స్థానిక అరబ్బులతో పాటు ఇక్కడ నివాసముంటున్న భారతీయులు విభిన్న రీతులలో జరుపుకుంటారు. అనేకులు తమ మిత్రబృందంతో కలిసి, కొందరు ఎడారి ఇస్త్రార్హాలలో లేదా హోటళ్ళలో విందు జరుపుకుంటుండగా మరికొందరు పేద కార్మికుల మధ్య జరుపుకుంటూ తమ ధార్మిక మాసంలో తమ సేవా భావాన్ని చాటుతారు.
Also Read: రంజాన్ మాసంలో కార్మికులకు భోజన సామగ్రి అందించిన దుబాయి తెలుగు అసోసియెషన్
అందునా హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసికట్టుగా చేసే ఈ రకమైన సేవలతో మైత్రి వెల్లివిరుస్తుంది. అది దైవ కార్యంగా భావించి నిర్వహిస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది, భారతీయ వసుధైక కుటుంబ విలువలు ఇతరులకు తెలుస్తాయి.
రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా సెంట్రల్’ రంజాన్ ఆహార సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఒక మూతపడ్డ కార్మాగారంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ కార్మికుల మధ్య ఇటీవల నిర్వహించింది. తెలుగు టైటాన్స్, అల్ రాజ్హీ బ్యాంక్ ఎంప్లాయిస్ తదితర 110 మంది దాతలు ఈ కార్యక్రమానికి సహాయమందించారని సాటా సెంట్రల్ అధ్యక్షుడు జి. ఆనంద రాజు తెలిపారు.
Also Read: బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఇఫ్తార్ విందులో అరబ్బు ప్రముఖులు
ఈ కంపెనీలో 350 మంది కార్మికులు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నారని, వీరికి ఒక పూట కాకుండా కనీసం ఒక నెల వరకు భోజన వసతి కల్పించాలని తాము నిర్ణయించి ఈ ఆహార సామాగ్రిని అందించినట్లుగా ఆనందరాజు, మహిళ విభాగం అధ్యక్షురాలు కందుల సుచరితలు తెలిపారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

డాలస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

తానా సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

TANA: జులైలో డెట్రాయిట్లో 24వ తానా మహా సభలు

బహ్రెయిన్‌లో వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగు ఎన్నారైలకు దుబాయిలో జీఎమ్సీ ఇఫ్తార్ విందు
