Vijayawada: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. కోర్టు కీలక నిర్ణయం..
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:24 PM
Vallabhaneni Vamshi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీసుపై అటాక్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు కేసుల్లో బెయిట్ కోరుతూ పిటిషన్ వేయగా.. కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది..

విజయవాడ, మార్చి 27: వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సెషన్స్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ విజయవాడ 12 అదరపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో వంశీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ వంశీ ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసుల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నప్పటికీ.. ప్రతిసారి ఎదురుదెబ్బే తగులుతుంది.
Also Read:
బాబోయ్.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల
ఆ ఒక్క మెసేజ్.. క్షణాల్లో మంత్రి నారా లోకేష్ చర్యలు
రూల్స్ అక్కర్లేదు అంటున్న ధోని
For More Andhra Pradesh News and Telugu News..