స్నానానికి వెళ్లి...శాశ్వతంగా దూరమై!
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:26 AM
పెద్దాపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): అమ్మవారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన యువకుడు, బాలుడు మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యానాంకు చెందిన కొప్పాడ సత్తిబాబు, తిరమూడి రాజు కుటుంబాలు ఈ నెల 1న నూకాలమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం సమీపంలోని ఓ తోటలో వంట వండుకుని

కాకినాడ జిల్లాలో విషాద ఘటనలు
కాండ్రకోట ఏలేరు కాలువలో
స్నానానికి దిగి ఇద్దరి మృతి
పెద్దనాపల్లి ఏలేరు కాలువలో మరణించిన ఇద్దరు యువకులు
శోకసంద్రంలో కుటుంబసభ్యులు
పెద్దాపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): అమ్మవారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన యువకుడు, బాలుడు మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యానాంకు చెందిన కొప్పాడ సత్తిబాబు, తిరమూడి రాజు కుటుంబాలు ఈ నెల 1న నూకాలమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం సమీపంలోని ఓ తోటలో వంట వండుకుని కుటుంబ సమేతంగా అందరూ కలిసి భోజనాలు ముగించుకుని ఆనందం గా గడిపారు. ఇంతలో కొప్పాడ బాలు(20), తన మేనల్లుడు తిరుమాడి నాగవిశాల్ వర్మ (8) స్థానిక ఏలేరు కాలువలోకి స్నానానికి వెళ్లారు. సాయంత్రం అయిన వారు రాకపోవడంతో వారి కోసం ఎదురుచూసిన కుటుంబీకులు వారికి ఆచూకీ దొరకలేదు. ఈ విషయా న్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో స్థానిక పోలీసులకు వారు సమాచారం అందించారు. చీకటి పడిపోవడంతో మర్నాడు ఉదయాన్నే ఎస్‌ఐ మౌనిక, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యం లో గజ ఈతగాళ్లతో ఏలేరు నదిలో గాలింపు చ ర్యలు చేపట్టారు. ఈలోగా బాలుడు వర్మ మృతదేహం ఉదయం కనుగొన్నారు. బాలు మృతదేహం కోసం మరో 3 గంటలు వరకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఏలేరు కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడంతో సాయంత్రానికి మృతదేహం లభ్యమైంది. 2 మృ తదేహాలను శవపంచనామా నిమిత్తం పెద్దాపు రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేశా రు. బాలుకు తల్లితండ్రి తో పాటు చెల్లి హారిక ఉంది. ఆ కుటుంబాలు చిరు ఉద్యోగాలతో జీవ నం సాగిస్తుండగా మృత్యువు కబళించడంతో ఆ కుటుంబ సభ్యులు పెట్టిన రోదన చూపరులను కంటతడి పెట్టించాయి. వర్మ నాల్గోతరగతి చ దువుతూ మేనమామతో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే మృత్యు వు కాటేయడంతో 2 కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఏలేశ్వరం/జగ్గంపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి ఏలేరు నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో జరిగింది. జగ్గంపేట గ్రామానికి చెందిన దేవర జీవన్‌కుమార్ (19), మెల్లి వీరవెంకట దుర్గ అలియాస్ తరుణ్(19)లు మిత్రులతో కలిసి బుధవారం స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు కిర్లంపూడి- ఏలేశ్వరం సరిహదులో ఉన్న ఏ లేరు కాలువలోకి దిగారు. అయితే జీవన్‌కుమార్, తరుణ్‌లు నీటిలో కొట్టుకుపోవడంతో తోటి స్నేహితులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్‌కె.శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్‌ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరు కుని వివరాలు సేకరించారు. ఘటన ఏలేశ్వరం పరిధికి రావడంతో ఏలేశ్వరం ఎస్‌ఐ రామలింగేశ్వరరావుకు సమాచారం అందించగా ఆయన అక్కడ చేరుకున్నారు. జగ్గంపేటకు చెందిన మొత్తం ఏడుగురు యువకులు పెద్దనాపల్లి శివారులో ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లగా ప్రమాదశాత్తు నీటిలో మునిగిపోవడంతో జీవ న్‌కుమార్, తరుణ్ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసు పత్రికి తరలించినట్టు చెప్పారు. యువకుల మృతితో జగ్గంపేటలోని యాదవపేటలో విషా దచాయలు అలముకున్నాయి. జీవన్ ఇటీవల ఇంటర్ పరీక్షలు పూర్తి చేశాడు. అతడి తల్లిదండ్రులు దేవర వాసు, వరలక్ష్మి. తాపీ పని చే స్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న కొడుకు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరవుతు న్నారు. తరుణ్ తండ్రి రాంబాబు దేవుడి బొమ్మ లు తయారు చేస్తుంటాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతిచెందడంతో తండ్రితో పాటు కుటుంబసభ్యులు తీవ్ర వేదన చెందుతున్నారు.