అమ్మ,నాన్నలు మందలించారని ఆరుగురు విద్యార్థుల అదృశ్యం
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:12 AM
ఆలమూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): స్కూ ల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఆలమూరులో వెలుగులోనికి వచ్చింది. డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఖండ్రిగలోని యానాదు

ఆలమూరులో వెలుగులోకి వచ్చిన ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ఆలమూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): స్కూ ల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఆలమూరులో వెలుగులోనికి వచ్చింది. డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఖండ్రిగలోని యానాదుల పేటకు చెందిన విద్యార్థులైన నలుగురు అబ్బా యిలు, ఇద్దరు అమ్మాయిలు ఈనెల 24న రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటి నుంచి పరార య్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఆల మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. ఆలమూరు యానాదులపేటలో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే ఐదు కుటుంబాలకు చెందిన కొమరగిరి పృధ్వీవర్మ (12) 6వ తరగతి, కొమరగిరి కరుణ(14) 8వ తరగతి, గంధం సత్యనారాయణ(13) 8వ తరగతి, మరి సంతోష్(14) 7వ తరగతి, కొమరగిరి పండు (12) 6వ తరగతి, రామచంద్రపురానికి చెందిన కొమరగిరి మాధురి(12) 7వ తరగతి చుదువుతున్నారు. కొమరగిరి కరుణ ఆలమూరు బొబ్బా జయశ్రీ గరల్స్ హైస్కూల్‌లో చుదువుతుండగా పృధ్వీవర్మ, సత్యనారాణ, సంతోష్, పండులు కొత్తూరు సెంటర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. మధురి రామచంద్రపురంలో చదువుతుండగా 4రోజుల క్రితం ఆల మూరుకు తన చిన్నమ్మ ఇంటికి వచ్చింది. ఈ ఆరుగురు ఈనెల 24న రాత్రి 7గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి స్థానిక వినాయక గుడి సెంటర్ నుంచి వెళ్లినట్టు పోలీసులు సేకరించిన సమాచారం మేరకు తెలుస్తుంది.
ఒకే కాలనీ వాసులు
అదృశ్యమైనవారంతాఆలమూరులోని యానాదులపేటకు చెందినవారు. ఇక్కడ దాదాపు 50 కుంటుబాలు కూలీపనులు, చేపలవేట తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పిల్లలను స్కూల్‌కు పంపించి తల్లిదండ్రులు పనులకు వెళ్లడం జరుగుతుంది. అయితే వారి పై సక్రమైన అజమాయిషీ లేకపోవడంతో స్కూల్‌కు వెళ్లడం లేదు. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపఽథ్యంలో వారిని మందలించడం జరిగింది. దీం తో అలిగి ఇంటి నుంచి పరారైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు వివరించారు.
ఆచూకీ కోసం ప్రత్యేక బృందం
ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్.విద్యాసాగర్, ఆలమూరు ఎస్‌ఐ ఎం.అశోక్ కేసు నమోదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఆలమూరు ఎస్‌ఐ అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌లను సేకరించే చర్యలు చేపట్టారు.