Share News

టోల్‌ మోత!

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:06 AM

టోల్‌చార్జీల బాదుడు మళ్లీ మొదలైంది. టోల్‌ ప్లాజాల వద్ద వసూలు చేసే రుసుములను పెం చుతూ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇం డియా తీసుకున్న నిర్ణయం సోమవారం అర్ధ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుంచి అమ ల్లోకి వచ్చింది. పదినెలల వ్యవధిలో రెండోసారి చార్జీలు పెంచడంతో వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఆరు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి.

టోల్‌ మోత!
Toll Gate

  • సోమవారం రాత్రి నుంచి అమలు

  • 10 నెలల్లో రెండు సార్లు

  • రూ.5 నుంచి 50 వరకూ పెంపు

  • పాస్‌ల రుసుము పెంపుదల

  • ఫాస్టాగ్‌లో అదనంగా కట్‌

  • వాహనదారుల ఆందోళన

  • ఉమ్మడి జిల్లాలో 6 టోల్‌గేట్లు


(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)

ప్రభుత్వం వాహనదారులకు షాక్‌ వచ్చింది. కేవలం పది నెలల వ్యవధిలోనే రెండు సార్లు టోల్‌ రుసుములు పెంచడంతో ఆందోళనకు గు రవుతున్నారు.సోమవారం అర్ధరాత్రి 12.01 గం టల నుంచి పెంచిన టోల్‌చార్జీలను వసూలు చేయడం ఆరంభించారు.గతేడాది జూన్‌లో పెం చి ఏడాది తిరక్కుండానే మళ్లీ చార్జీలు పెం చడంపై వాహనదారులు టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద కనిపించింది. తమ ఫాస్టాగ్‌లో అధికంగా కట్‌ అయిందంటూ సోమవారం అర్ధరాత్రి తర్వాత పలువురు వాహ నదారులు చాలా చోట్ల సిబ్బందిని నిలదీశారు.


ఉమ్మడి జిల్లాలో టోల్‌గేట్లు ఇవీ..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి 16పై తుని-రాజమహేంద్రవరం మధ్య కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం,దివాన్‌చెరువు-సిద్ధాంతం మధ్య డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నా యి. 216వ జాతీయ రహదారిపై కత్తిపూడి-కాకినాడ బైపాస్‌ మధ్య గొల్లప్రోలు, గురజనాపల్లి -పాశర్లపూడి మధ్య గల కోనసీమ జిల్లా అన్నం పల్లి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి.ఇవన్నీ నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉంటాయి.తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు గామన్‌ బ్రిడ్జిపై,నల్లజర్ల మండలం వీరవల్లి వద్ద రెండు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.ఇవి రాష్ట్ర ప్రభుత్వసంస్థ ఏపీఆర్‌డీసీ ఆధీనంలో ఉన్నాయి.


పది నెలల్లో రెండో సారి..

అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాలు ఆయా టోల్‌గేట్ల వద్ద నిర్ణీత రుసుమును ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించాలి. ఫాస్టాగ్‌ లేకపోతే చార్జీలు 100 శాతం వరకూ అదనంగా వసూలు చేస్తారు.ఈ చార్జీలను నేషనల్‌ హైవే అథారిటీ నిర్ణయిస్తుంది. సాధారణంగా రహదారి నిర్మాణానికి అయ్యే వ్యయానికి అనుగుణంగా ఈ చార్జీలను నిర్ణయించి వసూలు చేస్తారు.ఇప్పుడు వీటిని ప్రతి ఏటా పెంచుతు న్నారు. 2024-25లో జూన్‌ 3న టోల్‌ రుసు ము లు పెంచగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే పెం చుతూ నేషనల్‌ హైవే అథారిటీ నిర్ణయం తీసుకు ంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు టోల్‌ప్లాజాల్లో పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చిం ది. రుసుముల పెంపులో ఎన్‌హెచ్‌ ఒక్కొక్క చోట ఒక్కో విధానాన్ని అవలంభించింది. 216వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో కార్లు, జీపులు, వేన్‌లు ఇతర తేలికపాటి వాహనాలకు ఒకవైపు రుసుమును పెంచలేదు. 24 గంటల వ్యవధిలో తిరిగి వస్తే వసూలు రుసుం మాత్రం పెంచారు.ఎన్‌హెచ్‌ 16పై మాత్రం అన్ని రకాల టోల్‌ రుసుములు పెంచి షాక్‌ ఇచ్చారు. టోల్‌గేట్‌ పరిధిలో ఉండే వాహనదారులకు ఇచ్చే నెలవారీ పాస్‌ల రుసుములను భారీగా పెంచారు. రూ. 340గా ఉన్న రుసుమును రూ.350 చేశారు.


ఈతకోట (రావులపాలెం) టోల్‌గేట్

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.120

రూ.125

రెండు వైపులా

రూ.180

రూ.185

మినీబస్‌లు

రూ.195

రూ.200

రెండు వైపులా

రూ.290

రూ.300

బస్‌ లేదా ట్రక్‌

రూ.405

రూ.420

రెండు వైపులా

రూ.610

రూ.630

వ్యాపార వాహనాలు

రూ.445

రూ.460

రెండు వైపులా

రూ.665

రూ.690

భారీ వాహనాలు

రూ.445

రూ.460

రెండు వైపులా

రూ.665

రూ.690

మెషినరీ వాహనాలు

రూ.635

రూ.660

రెండు వైపులా

రూ.955

రూ.990

అతి భారీ వాహనాలు

రూ.775

రూ.805

రెండు వైపులా

రూ.1165

రూ.1205

నెలవారీ పాస్‌లు

రూ.340

రూ.350


కొవ్వూరు టోల్‌గేట్‌ (216ఏ)

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.72

రూ.72

రెండు వైపులా

రూ.108

రూ.110

మినీబస్‌లు

రూ.108

రూ.110

రెండు వైపులా

రూ.158

రూ.162

బస్‌ లేదా ట్రక్‌

రూ.213

రూ.219

రెండు వైపులా

రూ.320

రూ.328

వ్యాపార వాహనాలు

రూ.309

రూ.317

రెండు వైపులా

రూ.463

రూ.475



వీరవల్లి (నల్లజర్ల) టోల్‌గేట్‌

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.160

రూ.165

రెండు వైపులా

రూ.240

రూ.245

మినీబస్‌లు

రూ.255

రూ.265

రెండు వైపులా

రూ.385

రూ.400

బస్‌ లేదా ట్రక్‌

రూ.535

రూ.555

రెండు వైపులా

రూ.805

రూ.835

వ్యాపార వాహనాలు

రూ.585

రూ.605

రెండు వైపులా

రూ.880

రూ.910

మెషినరీ వాహనాలు

రూ.840

రూ.870

రెండు వైపులా

రూ.1265

రూ.1310

అతి భారీ వాహనాలు

రూ.1025

రూ.1060

రెండు వైపులా

రూ.1540

రూ.1595


గొల్లప్రోలు టోల్‌గేట్‌

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.50

రూ.50

రెండు వైపులా

రూ.75

రూ.80

మినీబస్‌లు

రూ.80

రూ.85

రెండు వైపులా

రూ.120

రూ.125

బస్‌ లేదా ట్రక్‌

రూ.170

రూ.175

రెండు వైపులా

రూ.255

రూ.265

వ్యాపార వాహనాలు

రూ.185

రూ.195

రెండు వైపులా

రూ.280

రూ.290

మెషినరీ వాహనాలు

రూ.270

రూ.275

రెండు వైపులా

రూ.400

రూ.415

అతి భారీ వాహనాలు

రూ.325

రూ.340

రెండు వైపులా

రూ.490

రూ.505


అన్నంపల్లి (ముమ్మిడివరం) టోల్‌గేట్‌

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.60

రూ.60

రెండు వైపులా

రూ.90

రూ.95

మినీబస్‌లు

రూ.95

రూ.100

రెండు వైపులా

రూ.145

రూ.150

బస్‌ లేదా ట్రక్‌

రూ.205

రూ.210

రెండు వైపులా

రూ.305

రూ.315

వ్యాపార వాహనాలు

రూ.225

రూ.230

రెండు వైపులా

రూ.335

రూ.345

మెషినరీ వాహనాలు

రూ.320

రూ.330

రెండు వైపులా

రూ.480

రూ.495

అతి భారీ వాహనాలు

రూ.390

రూ.405

రెండు వైపులా

రూ.585

రూ.605


కృష్ణవరం (కిర్లంపూడి) టోల్‌గేట్‌

వాహనం

పాతది

కొత్తది

కారు, జీపు, వ్యాన్‌

రూ.105

రూ.110

రెండు వైపులా

రూ.160

రూ.165

మినీబస్‌లు

రూ.170

రూ.180

రెండు వైపులా

రూ.260

రూ.265

బస్‌ లేదా ట్రక్‌

రూ.360

రూ.375

రెండు వైపులా

రూ.540

రూ.560

వ్యాపార వాహనాలు

రూ.395

రూ.410

రెండు వైపులా

రూ.590

రూ.610

మెషినరీ వాహనాలు

రూ.560

రూ.585

రెండు వైపులా

రూ.850

రూ.880

అతి భారీ వాహనాలు

రూ.690

రూ.715

రెండు వైపులా

రూ.1035

రూ.1070

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 01 , 2025 | 06:00 PM