రూ.84.61 కోట్లు వసూలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:12 AM
రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లింపుదారులకు ఇచ్చిన వెసులుబాటును వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 31 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లింపుదారులకు ఇచ్చిన వెసులుబాటును వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు పన్నులు చెల్లింపులు సోమవారం సమర్థవంతంగా జరిగాయి. జిల్లాలో రాజమహేంద్రవరం కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీలతో పాటు ఇతర పంచాయతీల్లో సైతం పన్నులు చెల్లింపులు ప్రక్రియ వేగంగా సాగింది. సెలవు రోజులైన ఆదివారం, సోమవారం కూడా పన్నుల చెల్లింపుదార్ల కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఆయా కౌంటర్లను వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరంలో 8 ప్రత్యేక కౌంటర్లను కమిషనర్ కేతన్ గార్గ్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో పన్నులు చెల్లింపు దారు లు ప్రభుత్వం కల్పించిన పన్నుల వడ్డీపై ప్రకటించిన 50 శాతం రాయితీ వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరం నగరంలో సోమవారం ఒక్కరోజేఇంటిపన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, వాటర్ చార్జిలు కలిసి మొత్తం రూ3 కోట్లు ప్రజలు కట్టారు.ఇప్పటి వరకు ఇంటి ప న్నులకు సంబంధించి మొత్తం రూ.69 కోట్లు డిమాండ్‌కు మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు రూ.65.19 కోట్లు వసూలు చేశా రు.ఖాళీస్థలాల పన్నులు రూ.12.45 లక్షలు, వాటర్ చార్జీలు రూ.9.19 కోట్లు వసూలు చేశారు.చివరి రోజున హౌస్ ట్యాక్స్ రూ.2.19 కోట్లు, ఖాళీ స్థలాల పన్నులు రూ.44.87 లక్షలు ,వాటర్ చార్జిలు రూ.24 లక్షలు వసూలు చేశా రు.రాజమహేంద్రవరంలో మొత్తం రూ.84.61 కోట్లు వసూలు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఇంకా 53.27 కోట్లు వసూలు కావాల్సి ఉంది.