బిల్లులకు నో టెన్షన్
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:09 AM
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, పెన్షనర్లు,ఇతర బిల్లుల క్లియరెన్స్ విషయంలో పెద్ద టెన్షన్ ఉండేది.

దారిలో పెట్టిన కూటమి
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, పెన్షనర్లు,ఇతర బిల్లుల క్లియరెన్స్ విషయంలో పెద్ద టెన్షన్ ఉండేది. 31వ తేదీ అర్ధరాత్రి వర కూ ట్రెజరీలు పనిచేసేవి.అనేక మంది బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయేవి. అందరూ ట్రెజరీ అధికారుల చుట్టూ తిరిగేవారు. ట్రెజరీ అధి కారులకు లంచాలు ఇస్తేనే కొన్ని బిల్లుల చెల్లిం పులు జరిగేవి. ఈ ఏడాది బిల్లుల విషయంలో ఎవరికీ టెన్షన్ లేకపోవడం గమనార్హం. రాజ మహేంద్రవరం జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు డివిజనల్ కార్యాలయం ఉంది. కొవ్వూ రు, నిడదవోలు, అనపర్తి, కోరుకొండ మండల కేంద్రాల్లో సబ్- ట్రెజరీ కార్యాలయాలు ఉన్నా యి. జిల్లాలో సుమారు 19వేల మంది ఉద్యో గులు ఉన్నారు.వీరికి జీతాల కింద రూ.100 కోట్లు వరకూ చెల్లిస్తుంటారు. సుమారు 13 వేల మంది పింఛనుదారులకు సుమారు రూ.40 కోట్ల వరకూ అందుతోంది.ఇక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు, డెత్ బెనిఫిట్స్, జీపీఎఫ్, ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫర్ ఎర్న్ లీవులు వంటివన్నీ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి ఏ సమస్య లేకుండా ముందుగానే క్లియర్ చేసినట్టు జిల్లా ట్రెజరీ అధికారి ఎన్.సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వంలో బిల్లులు పాసవ్వాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెమ్మదిగా అన్నీ దారిలో పడ్డాయి. గ్రీన్‌ఛానల్ ద్వారా అనేక బిల్లులకు ప్రభుత్వమే సీఎఫ్‌ఎంఎస్ ద్వారా క్లియర్ చే స్తోంది.అందరిలోనూ సంతృప్తిని పెంచుతోంది.