Share News

అసెంబ్లీలో ఎమ్మెల్యేల గళం

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:53 AM

బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామాన్ని కేన్సర్‌ మహమ్మారి నుంచి కాపాడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీలో కోరారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల గళం
మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామాన్ని కేన్సర్‌ మహమ్మారి నుంచి కాపాడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీలో కోరారు. బిక్కవోలు మం డలం బలభద్రపురంలో సుమారు 200 మంది కేన్సర్‌తో భాదపడుతున్నారని సు మారుగా 30 మంది పైగా కేన్సర్‌ భారిన పడి మరణించారన్నారు.ఈ పరిస్థితి అంతుపట్టకుండా ఉందన్నారు. గత ప్ర భుత్వ హయాంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన నాటి నుంచి గ్రామంలో ఆరోగ్య సమస్యలు పెరిగాయన్నారు. ప్రభుత్వం శ్రద్ద వహిం చి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులను కాపాడాలన్నారు.పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ లు దృష్టి సారించాలని సభను కోరారు.

సమానత్వమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు

గోపాలపురం,మార్చి 20 (ఆంధ్రజ్యో తి) : పేదరిక నిర్మూలన, స మానత్వమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ చేశారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై ఆయన మా ట్లాడారు.ఉపకులాల మధ్య ఉన్న అభి ప్రాయాలు తీసుకుని ఏ,బీ,సీ,డీ వర్గీకర ణకు సభలో ఆమోదం తెలపడం గర్వం గా ఉందన్నారు.1984లో టీడీపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయు డు సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాల ల ను మరింత అభివృద్ధి చేశారన్నారు. నా ఉన్నత చదువులకు సాంఘిక సం క్షేమ గురుకులాలు దోహదపడ్డాయన్నారు.

రాజానగరంలో విద్యుత్‌ సమస్యలు

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, మార్చి 20 (ఆంధ్ర జ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వం నియో జకవర్గంలో విద్యుత్‌ సమస్యలను పూర్తి గా గాలికొదిలేసిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీతో తన గళాన్ని వినిపించారు. ప్రధానంగా నియోజక వర్గంలో లైన్‌మెన్ల కొరత వేధిస్తుంద న్నారు. నియోజకవర్గంలో 73 ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాల్లేక, 1851 చోట్ల వీధి లైట్లు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైసీపీ పాలన లో 350 అగ్రికల్చర్‌ కనెన్షన్లు పెండిం గ్‌లో ఉన్నాయన్నారు. గతంలో డ్యామేజ్‌ జరిగిన చోట్ల రీప్లేస్‌ చేయడానికి మం జూరైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభా లను గత పాలకులు రియల్‌ ఎస్టేట్‌లో ఉపయోగించుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.అనంతరం మంత్రి లోకేశ్‌ ను కలిసి రాజానగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు, కోరు కొండ,రాజానగరాల్లో ప్రభుత్వ డిగ్రీ కళా శాలలు ఏర్పాటు చేయాలని విన్నవించా రు.దీనిపై మంత్రి లోకేష్‌ సానుకూలంగా స్పందించారని బత్తుల తెలిపారు.

Updated Date - Mar 21 , 2025 | 12:53 AM