భవన నిర్మాణాల్లో నిబంధనలు మీరొద్దు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:39 AM
రాజమహేంద్రవరంలో నిబంధనల మేరకే భవనాలు నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆదివారం గాదాలమ్మనగర్‌లో జీవోఎంఎస్ నెం 119కు లోబడి నిర్మించిన రెసిడెన్షియల్ అపార్టుమెంట్ ఆక్యుపెన్సీ ఫైల్‌ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్‌తో పాటు భూగర్బ జలాల పెంపు కోసం నిర్మించిన వర్షపు నీటి గుంతలు పరిశీలించారు.

కమిషనర్ కేతన్ గార్గ్
గాదాలమ్మనగర్‌లో అపార్టుమెంట్ల తనిఖీ
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23(ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో నిబంధనల మేరకే భవనాలు నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆదివారం గాదాలమ్మనగర్‌లో జీవోఎంఎస్ నెం 119కు లోబడి నిర్మించిన రెసిడెన్షియల్ అపార్టుమెంట్ ఆక్యుపెన్సీ ఫైల్‌ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్‌తో పాటు భూగర్బ జలాల పెంపు కోసం నిర్మించిన వర్షపు నీటి గుంతలు పరిశీలించారు. భ వన ఎత్తు, సెట్ట్‌బ్యాక్‌లు, అపార్టుమెంట్ యాక్సెస్ కలిగిన రహదారి వెడల్పు పరిశీలించారు. పట్టణ నిర్మాణ నిబంధనలకు అనుగుణం గా నిర్మాణాలు ఉన్నాయా లేదా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన పరిపాలన ని బంధనలను క్రమంగా పాటిస్తూ పట్టణ ప్రణాళికకు అనుగుణంగా భవన నిర్మాణాలను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ జి.కో టయ్య, డిప్యూటీ ప్లానర్ సత్యనారాయణ రాజు, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.