జిల్లాలో 10 ఆర్‌వోబీల నిర్మాణం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:50 AM
తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావ డంతో జిల్లాకు మంచిరోజులు వస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు విజన్‌తో కలెక్టర్ పి.ప్రశాంతి 2025-26 జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.అమరావతిలో మంగళవారం సీ ఎం చంద్రబాబు సమక్షంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైన సంగతి తెలిసిందే.

పలు అంశాలపై నివేదికలు రెడీ
నేడు సీఎం ముందు ప్రజంటేషన్
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావ డంతో జిల్లాకు మంచిరోజులు వస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు విజన్‌తో కలెక్టర్ పి.ప్రశాంతి 2025-26 జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.అమరావతిలో మంగళవారం సీ ఎం చంద్రబాబు సమక్షంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఇది బుధవారం కూడా జరగనుంది. షెడ్యూల్ ప్రకారం బుధ వారం కలెక్టర్ యాక్షన్ ప్లాన్‌ను సీఎం ముందు ప్రజంటేషన్ చేయనున్నారు. వ్యవసాయం నుం చి టూరిజం వరకూ అభివృద్ధిపై పలు అంశా లతో విజన్ డాక్యుమెంటరీ సిద్ధం చేశారు. జిల్లా లో 77,820 హెక్టార్లలో పంట లక్ష్యంగా నిర్ణ యించారు. 4970 హెక్టార్లలో ఉద్యాన పంట లను ప్రోత్సహించనున్నారు. జిల్లాలో 12 శాతం నుంచి 15 శాతం వరకూ పాలు, మాం సం, గుడ్ల వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2 వేల హెక్టార్లలో మత్స్య సంపదను అదనంగా పెంచే లక్ష్యం పెట్టుకున్నారు.కడియంలో క్రైయో ప్రిజర్వేషన్ ల్యాబ్ స్థాపిస్తారు.రెవెన్యు పెంచ డమే లక్ష్యంగా జిల్లాలో మైనింగ్ అండ్ క్వారీ యింగ్‌కు లీజులను ఆపరేషన్‌లోకి తీసుకు రా నున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ ఎంఈ ఇండస్ర్టియల్ వృద్ధి కోసం నానో ఎం ఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. విశ్వకర్మ యూనిట్లను స్థాపిస్తారు. కల్వచర్లలో ఇండస్ర్టియల్ పార్కు అండ్ జియో -బయోఫ్యూయల్ ఇండస్ర్టీని ప్రారంభించనున్నా రు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 7500 కిలో వాట్స్ సామర్థ్యంతో 2500 ఇళ్లపై రూఫ్‌టాప్ ఏర్పాటు చేయనున్నారు. పంచా యతీ రాజ్ శాఖ కింద జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధి లోని 49 హేబిటేషన్లలో రూ.29.24 కోట్ల నాబార్డ్ నిధులతో 17 పనులను పూర్తి చేయనున్నారు.రూ.85 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో 160 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లు నిర్మించనున్నారు. నిడ దవోలు వద్ద ఆర్వోబీని రూ.184.74 కోట్లు, రాజా నగరం నుంచి సామర్లకోట వరకూ రూ.298. 70 కోట్లతో ఏడీబీ రోడ్డు అభివృద్ధి చేస్తున్నారు. ఖమ్మం మీదగా పట్టిసీమ జిల్లా వరకూ 40.4 కిలోమీటర్ల మేర రూ.368.63 కోట్లతో జాతీయ రహదారిని నిర్మించనున్నారు.జిల్లాలో 10 ఆర్వోబీలు నిర్మించనున్నారు. జిల్లాలో 10,794 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.347. 15 కోట్లతో జరుగుతున్న రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు రెండో టెర్మినల్ పనులు వచ్చే ఆగస్టు 30వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. భవనాలకు రూ. 204 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అక్టోబరులో ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో కడియ పులంకలో నిర్వహించనున్నారు.బ్రిడ్జిలంకలో అడ్వంచర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తారు. విజయ వాడ- వైజాగ్ రైల్వే రూట్‌లో డబ్లింగ్ కింద శెట్టిపేట,సింగవరం, తాళ్లపాలెం గ్రామాల మీద బైలైన్ నిర్మించనున్నారు. బొమ్మూరు వద్ద ఎస్‌సీడీసీ స్కీమ్ కింద వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదిం చారు. దీని వల్ల 5 వేల మంది రైతులు లబ్ధి పొందుతారు. 16 ఎంపీ ఎఫ్‌పీ (మల్టీ పర్పస్ ఫెసిలిటేటింగ్ సెంటర్లు)నిర్మిస్తున్నారు.దీని వల్ల వెయ్యి మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రా జమహేంద్రవరం ఆర్ట్స్‌కాలేజి, ప్రభు త్వాసుప త్రుల వద్ద 4జీ సాట్యు రేషన్ ప్రాజె క్టులను నెలకొల్పనున్నారు. కొవ్వూరు వద్ద 50 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు.బయ్యవరం, తుపా కులగూడెం ప్రాంతాల్లోని వైట్‌ఫీల్డ్ పేపరుమిల్లు ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 271.35 ఎకరాల భూమి ఇండస్ర్టియల్ పార్కుకు కేటాయించనున్నారు.