Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:48 AM

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని రంగాపురం, ఇళ్లపల్లి, బిక్కవోలు, ఆర్‌ఎస్‌. పేట, ఊలపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ, పంచాయతీ సాధారణ నిధులు రూ.77.67 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించి, రూ.1.11 కోట్లతో నిర్మించనున్న పనులకు ఆయన భూమిపూజ చేశారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బిక్కవోలులో సీసీ రోడ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

  • ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

  • బిక్కవోలులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

బిక్కవోలు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని రంగాపురం, ఇళ్లపల్లి, బిక్కవోలు, ఆర్‌ఎస్‌. పేట, ఊలపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ, పంచాయతీ సాధారణ నిధులు రూ.77.67 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించి, రూ.1.11 కోట్లతో నిర్మించనున్న పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జోడునాదాల తూము వద్ద త్వరలో రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నామని, రంగాపురం, ఇళ్లపల్లి, తుమ్మలపల్లి, పాకలు ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగప డుతుందన్నారు. అలాగే రంగాపురంలో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను, ఊలపల్లిలో కాకర్ల రామన్నచౌదరి సౌజన్యంతో రూ. 7లక్షలతో నిర్మించిన బస్‌స్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల బిక్కవోలు మండల పరిషత్‌లో ఎంపీటీసీలు స్వచ్ఛందం గా బీజేపీలో చేరితే వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, అసలు తమ ఎంపీపీ ఎందుకు రాజీనామా చేశారో, మరలా ఎంపీటీసీ పదవికి కూడా ఎందుకు రాజీనామా చేశారో వివరించాలన్నారు. ఎంపీటీసీలను కించపరిచేలా మాట్లాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తేతలి సుమ, కూటమి నాయకులు శివరామకృష్ణంరాజు, ఇందల వీరబాబు, పల్లి శ్రీనివాసరెడ్డి, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, తనుకు శ్రీధర్‌, నడింపిల్లి చిరంజీవిరాజు, కానా టి అప్పలస్వామి, తొండాపు సురేష్‌కుమార్‌రెడ్డి, బేరా వేణమ్మ, సరెళ్ల సుమలత, ఎంపీడీవో శ్రీనివాస్‌, తహశీల్దార్‌ సత్యకృష్ణ, డీఈఈ అచ్యుతరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • గత ఐదేళ్లూ తాత్కాలిక విరామం

అనపర్తి, ఏప్రియల్‌ 4(ఆంధ్రజ్యోతి): 1983లో మండలంలోని రామవరంలో స్థాపించిన నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్‌ ఏటా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని, ఐదేళ్లుగా అరాచక పాలన నేపథ్యంలో పరిషత్‌ నిర్వహణకు తాత్కాలిక విరామం ప్రకటించవలసి వచ్చిందని పరిషత్‌ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 21 నుంచి 24వరకు నాటిక పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వైసీపీకి చెందిన శకుని మామ గతంలో పరిషత్‌ అకౌంట్లు కూడా అడిగారని, చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ తెలియజేస్తే ఎక్కడికి రమ్మన్నా వచ్చి లెక్కలు చెబుతామని రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:48 AM