Share News

గృహమస్తు!

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:32 AM

పేదల ఇంటికలను నెరవేర్చడానికి పనులు వేగవంతమ య్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా కాలనీల అభివృ ద్ధి మాత్రం చేపట్టలేదు. జగన్‌ ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నానని చెప్పి ఏ కాలనీలోనూ కనీసం వంద ఇళ్లను నిర్మించలేకపోవడంతో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నారు.

గృహమస్తు!
వెలుగుబంద కాలనీలో చక..చకా సాగుతున్న ఇళ్ల నిర్మాణం

ఇళ్ల నిర్మాణాల్లో కదలిక

వేగంగా సాగుతున్న నిర్మాణపనులు

ఫలించిన ప్రభుత్వ ప్రయోగం

కదులుతున్న పేద జనం

వెలుగుబందలో 3096 ఇళ్లు లక్ష్యం

మే నెలాఖరుకు పూర్తిచేసే యోచన

మరో 3 కాలనీల్లో ఆరంభమే లేదు

ఇళ్లు మొదలైతే పాత విధానమే

ఆరంభంకాకపోతే రెండు సెంట్లు

పేదింటికి అధనంగా నిధులు

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

పేదల ఇంటికలను నెరవేర్చడానికి పనులు వేగవంతమ య్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా కాలనీల అభివృ ద్ధి మాత్రం చేపట్టలేదు. జగన్‌ ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నానని చెప్పి ఏ కాలనీలోనూ కనీసం వంద ఇళ్లను నిర్మించలేకపోవడంతో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి న తర్వాత పేదలకు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగం గా పేదల కాలనీలకు ఎన్టీఆర్‌ కాలనీలు అని నామకరణం చేస్తూ ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. కానీ ఎక్కడా ఇంకా అధికారులు ఎన్టీఆర్‌ కాలనీ అని పేరు పెట్టకపోవడం గమనార్హం.

వెలుగుబందలో..

రాజానగరం మండలం వెలుగుబంద ఎన్టీఆర్‌ నగర్‌లో రాజమహేంద్రవరం పేదల కోసం 10,993 పట్టాలు ఇచ్చారు. 9,874 ఇళ్లను మం జూరు చేశారు. అందులో సుమారు 200 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. వంద ఇళ్లలో కాపురం ఉంటున్నారు. అనేక కారణాల వల్ల కొందరు పునాదులు వేయలేదు. మరికొందరు పునాదుల్లో నిలిపివేశారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే నెల చివరకు ఈ నగర్‌లో 3096 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌ ప్రశాంతి అధికారులను పరుగులు పెట్టిస్తున్నా రు. ఇప్పటికే 1882 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. అర్బన్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళుతున్నారు. రోజుకు 19 ఇళ్లను నిర్మించాలనే లక్ష్యం పెట్టారు.ఇంకా 1214 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కొందరు లబ్ధిదారులు మాత్రం బోర్లలో నీరు ఇంకిపోయిందని.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు అందక పను లకు ఆటంకం వస్తుందని చెబుతున్నారు. అధి కారులు మాత్రం పనులు పూర్తి చేస్తా మంటు న్నారు. సైట్‌లో ఉండి, ఇళ్ల నిర్మాణ లక్ష్యాలకు పనిచేస్తున్నామని హౌసింగ్‌ డీఈ కె.సూరిబా బు, ఏఈ కె.ఉమాశంకర్‌ తెలిపారు.

కానవరంలో కష్టాలు

రాజానగరం మండలం కానవరంలో గతం లో 1045 మందికి పట్టాలిచ్చారు. కానీ 808 ఇళ్లు మంజూరు చేశారు. ఇది రాజమహేంద్రవరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫరిజెల్లపేటకు సుమారు కిలోమీటర్‌ దూరంలో ఉంటుంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. విద్యుత్‌ సౌకర్యం లేదు. స్థంభాలు లేవు. నీటి సౌకర్యమూ లేదు. 102 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టగా 52 పూర్తి చేశారు.ఇక్కడ సౌకర్యాల్లేకపోవడంతో ఇప్పటి వరకూ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

పల్ల కడియంలో

గత సార్వత్రిక ఎన్నికల ముందు రాజమ హేంద్రవరం ప్రాంతానికి చెందిన 12,269 మం దికి సెంటు చొప్పున హడావుడిగా వైసీపీ పట్టా లు పంపిణీ చేసింది.కానీ స్థలం చూపించ లేదు. లబ్ధిదారులు పల్లకడియం వెళ్లి ఆరా తీస్తే అవిగో ఆ పొలాల్లో స్థలాలకే మీకు పట్టలిచ్చారని చెప్ప డంతో అందరూ ఉసూరుమంటూ తిరిగొ చ్చే స్తున్నారు.సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వీరి కష్టాలపై కూడా ఆరా తీసింది. వీరందరికీ అక్కడ సేకరించిన పొలాల్లో రెండేసి సెంట్ల వంతున పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది.ఈ మేరకు మునిసిపల్‌, హౌసిం గ్‌, రెవెన్యూ అధికారులు పర్యటించారు. త్వరలో లేఅవుట్లు వేసి రెండేసి సెంట్ల వంతున విభ జించి ఇళ్లను నిర్మించే యోచనలో ఉన్నారు.

ఆవ..అంతేనా?

బూరుగుపూడి, కాపవరం ఆవలో గత ప్రభు త్వం 12,269 మందికి పట్టాలు ఇచ్చింది. కానీ స్థలాలు చూపించలేదు. కానీ ఆవలోనే లేఅవుట్‌ వేసినట్టు చెప్పింది. ఇది వర్షాకాలంలో బాగా లో యలా మారుతుండడంతో ప్రజలు, రాజకీ య నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో కోర్టు ను ఆశ్రయిచారు.ఇక్కడ పట్టాలపై కొత్త ప్రభు త్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.ఆవలో మా త్రం ఇళ్లను నిర్మించదు.వేరే ప్రాంతాల్లో భూమి సేకరించి లబ్ధిదారుడికి రెండేసి సెంట్ల వంతున కేటాయించి,ఇళ్లు నిర్మించే నిర్ణయంతీసుకోవచ్చు.

పేదింటికి అధనంగా..

స్థలం ఉన్నా ఇళ్లు కట్టుకోలేమని చెప్పిన వారికి అదనంగా కొంత డబ్బు ఇచ్చి ఇళ్ళను నిర్మిస్తోంది. యూనిట్‌ ఖరీదు గతంలో రూ.1.8 లక్షలు మాత్రమే. ఇవా ళ మరో రూ.50 వేలు అదనంగా ఇస్తోంది. అంటేయూనిట్‌ ఖరీదు రూ. 2.3లక్షలు అయింది. దీంతో కొందరు ముందుకు వస్తున్నారు. ప్రభు త్వం ఎంత ఇబ్బంది ఉన్నా ఇక్కడ పేదలకు ఇళ్ల ను నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. దానికి జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి కృషి తోడవుతోంది.

వీరికే రెండేసి సెంట్లు

రాజమహేంద్రవరం అర్బన్‌ వెలుగుబంద కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడ పాత పద్ధతిలోనే నిర్మాణాలు ఉంటాయి. కానీ అదనంగా ప్రభుత్వం రూ.75 వేల వరకూ సహా యం చేస్తోంది.కానవరం, పల్ల కడియం, బూరుగుపూడి, కాపవరం ప్రాంతాల్లో స్థలాలు చూపిం చకపోయినా పట్టాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండేసి సెంట్ల వం తున స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మించనుంది.

ఆ కాలనీలకు వెళ్లలేం!

నాడు వైసీపీ ప్రభుత్వం ఊరికి దూరంగా శివారు ప్రాంతంలో స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇంటి నిర్మాణానికే ముందుకు రాలేదు. రాజమహేంద్రవరం నుంచి వెలు గుబంద కాలనీకి 18 కిలోమీటర్ల దూరం ఉంది. కానవరం అయితే 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపుగా మిగిలిన కాల నీలది అదే పరిస్థితి.పేదలకు కాలనీ వద్ద కు వచ్చి వెళ్లాలంటే కష్టమే. ఆటో కట్టిం చుకుంటే రూ.500 నుంచి రూ.800 డిమాం డ్‌ చేస్తారు. వెలుగుబంధ కాలనీకి అయితే దివాన్‌చెరువు సెంటర్‌ నుంచి డ్రాపింగ్‌కే రూ.150 తీసుకుంటున్నారు.ఈ నేపఽథ్యంలో నలుగురో ఐదుగురో కలిసి ఆటో కట్టించు కుని వస్తున్నారు.ఈ ప్రాంతానికి ఓ ఆర్టీసీ బస్సు వేయాలని ప్రజలు కోరుతున్నారు. మంచినీటి కోసం ఐదు ఓవర్‌ హెడ్‌ ట్యాం కులు మంజూరు చేశారు. రెండు పూర్త య్యాయి. మరో రెండు నిర్మాణంలో ఉన్నా యి. వాటికి వాటర్‌ కనెక్షన్‌ ఇవ్వవలసి ఉంది.అప్రోచ్‌ రోడ్డు వేశారు. విద్యుత్‌ సబ్‌- స్టేషన్‌ ఉంది. అన్ని వీధులకు విద్యుత్‌ ఉంది. కానీ డ్రైనేజీ లేదు.

Updated Date - Apr 02 , 2025 | 12:32 AM