Share News

ఆటిజం... అధిగమిద్దాం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:53 AM

నేటి సమాజంలో అనేక మంది పిల్లలు ఆటిజం సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒక్కరు ఆటిజంతో బాధపడుతున్నారని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివింట్‌ ఆటిజం (సీడీసీ) నివేదికలు చెప్తున్నాయి. ఆటిజంపై అవగాహన లేని తల్లిదండ్రులు కొందరు ఉండగా, పిల్లలకు దానిని పెద్ద జబ్బుగా భావించే తల్లి దండ్రులు మరికొందరు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు.

ఆటిజం... అధిగమిద్దాం

నేడు ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా...

నేటి సమాజంలో అనేక మంది పిల్లలు ఆటిజం సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒక్కరు ఆటిజంతో బాధపడుతున్నారని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివింట్‌ ఆటిజం (సీడీసీ) నివేదికలు చెప్తున్నాయి. ఆటిజంపై అవగాహన లేని తల్లిదండ్రులు కొందరు ఉండగా, పిల్లలకు దానిని పెద్ద జబ్బుగా భావించే తల్లి దండ్రులు మరికొందరు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు.

రాయవరం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జన్యుపరమైన కారణాలతో ఆటిజం వ్యాధి వస్తుంది. పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది. మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్ర ఉద్వేగాలకు లోనుకావడంతో పాటు ఇన్ఫెక్షన్‌లకు గురవుతారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు అందులో స్రవించే సెరటోనిక్‌, డోపమిన్‌ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆ టిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్థ తీసుకోకపోవడం, తల్లిదండ్రులు పిల్లలతో గడపకపోవడం కూడా ఆటిజం సమస్యకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

లక్షణాలు: సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం, నవ్వడం, నడవడం, ముద్దుముద్దుగా మాట్లాడడం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పిలుపునకు బదుల్వివడం వంటివి చేస్తుంటారు. ఆటిజం సమస్య వున్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించవు. వయసుకు తగ్గట్టుగా మానసిక పరిపక్వత లేకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కళ్లల్లోకి చూడలేకపోవడం, మాట్లాడలేక పోవడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం, చేసిన పనులనే మళ్లీమళ్లీ చేస్తుండడం, ఎలాంటి అనుభూతి తెలపకపోవడం, శరీరంపై గాయాలైనా తెలుసుకోలేకపోవడం, శబ్ధాలను పట్టించుకోకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం (లేదా) కారణం లేకుండా ఏడవడం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిలిచినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.

అధిగమించే మార్గాలు: పిల్లల్లో ఆటిజం సమస్యను అధిగమించేందుకు తల్లిదండ్రులు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కడుపులో బిడ్డ ఎదుగుదలను వైద్యుల ద్వారా తెలుసుకోవడం, గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాయామాలు చేయడం, మనోల్లాసంగా ఉండడంతో పాటు తల్లులు నిర్ధిష్టమైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడం వల్ల ఆటిజం ప్రమాదాన్ని నివారించవచ్చు. గర్భిణులు కొన్ని రకాలైన రోగాలను నియంత్రించేందుకు టీకాలు సైతం తీసుకోవాలి. శిశువు కదలికలకు సంబంధించిన ఏమైనా అనుమానిత లక్షణాలు గమనిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ ఆటిజం బయటపడితే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను కాపాడుకోవచ్చు.

తొందరగా గుర్తిస్తేనే నివారణ సాధ్యం

చిన్న పిల్లల్లో మెదడు ఎదుగుదల లోపంతో ఆటిజం వస్తుంది. వీరిలో చాలా మందికి తెలివితేటలు పూర్తిగా లేకపోవడం, పరస్పర సంభాషణలు సరిగ్గా లేకపోవడం, చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పకపోవడం, భావాలను వ్యక్తం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాత, అమ్మ, నాన్న వంటి పదాలను పలికిన కొన్ని రోజులకు పలకడం మానేయడం, వాళ్లలో వాళ్లు ఆడుకోవడం, పిలిచినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అను మానించి డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలు చేసిన పనులు మళ్లీ మళ్లీ చేయడం, ఒకే రకమైన వస్తువులు కావాలని కోరుకోవడం, అధిక కోపం, పిల్లలు వారిని వారు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా మందిలో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) ఆటిజం కి తేడా తెలుసుకోలేరు. ఏడీహెచ్‌డీ, ఆటిజం ఒకటి కాదు అని తల్లిదండ్రులు గుర్తించాలి. ఏడీహెచ్‌డీకి మందులు ఉన్నా ఆటిజంకు లేవు. ఆరు, ఏడు సంవత్సరాలు వచ్చే వరకు పట్టించుకోకుండా వదిలేస్తే పిల్లల్లో ఆటిజం నివారణ సాధ్యం కాదు. ఎంత తొందరగా గుర్తించి సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకువెళ్లి థెరపీ ఇప్పిస్తే అంత మంచిది.

డాక్టర్‌ వానపల్లి వరప్రసాద్‌, సైకియాట్రిస్టు. కాకినాడ

Updated Date - Apr 02 , 2025 | 12:53 AM