Share News

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:30 AM

పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. విక్టోరియా పేట కోదండ రామ స్వామి ఆలయంలో ధర్మకర్త రఘు ప్రేమ తీర్థ ఆధ్వ ర్యంలో చిన్మయ మిషన్‌ ఆవరణలో నిర్వహించారు.

కల్యాణం.. కమనీయం
ఆదోని చిన్మయ మిషన్‌లో సీతారాముల కల్యాణం

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో వైభవంగా శ్రీరామనవమి

కల్యాణం చేసిన వేద పండితులు

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. విక్టోరియా పేట కోదండ రామ స్వామి ఆలయంలో ధర్మకర్త రఘు ప్రేమ తీర్థ ఆధ్వ ర్యంలో చిన్మయ మిషన్‌ ఆవరణలో నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు చేపట్టారు. మహబూబ్‌ నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం దీక్షితుడు పాడిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మచారి నారాయణ చైతన్య, అధ్యక్షులు ఏగ్గాటి ప్రతాప్‌, మోహన్‌ రెడ్డి, విట్టా రమేష్‌, రఘునాథ్‌, రమేష్‌, రాముడు, జగదీష్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆదోని రూరల్‌: మండలంలోని పెద్దతుంబళం నక్షత్ర ఆకార రామాలయంలో రాత్రి 8గంటలకు కల్యాణం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి, భక్తులు పాల్గొన్నారు. అలాగే పెద్దహరివాణం, సంతేకుడ్లూరు, మండిగిరి, బసాపురం గ్రామాల్లో వేడుకలు జరిగా యి. రూరల్‌ సీఐ నల్లన్న బందోబస్తు నిర్వహించారు.

కల్యాణంలో పాల్గొన్న కేఈ కృష్ణమూర్తి దంపతులు

క్రిష్ణగిరి: కంభాలపాడు గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేఈ పద్మావతి దంపతులు, మాజీ సర్పంచ్‌ కేఈ చెన్నయ్య దంపతులు పాల్గొన్నారు.

ఆలూరు: మండలంలో శీరామ నవమి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక రామాలయంలో సీతా రాముల కల్యాణం నిర్వహించారు.

హాలహర్వి: మండలంలో గ్రామాల్లో శ్రీరామ నవమినిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూడటానికి జనం తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం చేశారు.

ఆస్పరి: యాటకల్లు గ్రామంలో రఽథోత్సవం వేడుకలను జరుపుకున్నారు. కలపరి గ్రామంలో పల్లకి మహాత్సవం నిర్వహించారు.

మద్దికెర: మండలంలోని మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం తదితర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు, కల్యాణోత్సవం వైభవంగా జరిగాయి. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ఊరేగించారు.

వెల్దుర్తి: మండలంలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించారు. వెల్దుర్తిలో ఇండేన్‌ గ్యాస్‌ డిస్ర్టిబ్యూటర్‌ ఎల్‌ఈ రమేశ్‌గౌడ్‌, ఎల్‌ఈ మహేశ్వరి దంపతులు పురోహితులు కేశవస్వామి, రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. మాజీ ఎంపీపీలు దశరఽథరామిరెడ్డి, జ్ఞానేశ్వర్‌గౌడు, పారిశ్రామికవేత్త సాయిప్రసాద్‌ హాజరయ్యారు. క్రిష్ణాపురం, రామళ్లకోట, సిద్దనగట్టు, బోయినపల్లి, రత్నపల్లి, నరసాపురం, మాదార్‌పురం గ్రామాల్లో గ్రామపెద్దలు నిర్వహించారు.

పత్తికొండ: పట్టణంలోని పాతపేట రామాలయం, ఆంజనేయ నగర్‌ సీతారామ దేవాలయం, కొత్తపేట రామాలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. పాతపేట రామాలయం, ఆంజనేయనగర్‌ సీతరామ ఆలయాల్లో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పాల్గొన్నారు. సాంబశివారెడ్డి, రామానాయుడు ఉన్నారు.

దేవనకొండ: మండలలంలోని తలమర్రి, కరివేముల, దేవనకొండ, పి.కోటకొండ, నల్లచెలిమల, గ్రామాల్లో కల్యాణం చేశారు.

తుగ్గలిలో ఘనంగా కల్యాణోత్సవం

తుగ్గలి: మండలంలోని తుగ్గలి, పగిడిరాయి, జొన్నగిరి, చెన్నంపల్లి, రామలింగాయపల్లె తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించారు. తుగ్గలిలో విశ్రాంత వీఆర్వో దామోదర్‌ రెడ్డి ఇంటి నుంచి మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహిం చారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ఇంటి నుంచి తలంబ్రాల బొట్లు, తాలిబొట్లు తీసుకునివచ్చి కల్యాణం నిర్వహించారు. సాయంత్రం పరమేశ్‌రెడ్డి ఇంటి నుంచి కుంభం తీసుకువచ్చి విశేష పూజలు చేశారు. భక్తులకు తుగ్గలి నాగేంద్ర అన్నదానం నిర్వహించారు.

Updated Date - Apr 07 , 2025 | 12:31 AM