Share News

గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:38 AM

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. గురువారం వేమగిరిలో నూతనంగా ని ర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను ఎంపీ పీ వెలుగుబంటి ప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసే విధంగా ప్రణాళికతో ముందు కు వెళుతున్నామన్నారు.

గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం
వేమగిరిలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

  • అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. గురువారం వేమగిరిలో నూతనంగా ని ర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను ఎంపీ పీ వెలుగుబంటి ప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసే విధంగా ప్రణాళికతో ముందు కు వెళుతున్నామన్నారు. వేమగిరిలో రూ.31.50 లక్షల పనులు పూర్తి చేశామని,మరో రూ.50 లక్షల పనులకు అంచనాలు సిద్ధం చేశామన్నా రు. ఇదిలా ఉండగా దుళ్ల జడ్పీ హైస్కూల్లో నిర్మించిన భోజనశాలను ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. హెచ్‌ఎం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గ్రామానికి చెందిన దాత యన్నమని లక్ష్మిపతి రూ.10 లక్షలతో హైస్కూ ల్లో పలు నిర్మాణాలు, పనులు చేపట్టారని, అలాగే వాష్‌ ఇనిస్టిట్యూట్‌ 13.5 లక్షలు, దా త చిట్టూరి వెంకన్న రూ.1.5 లక్షలు వెరసి రూ.15 లక్షలతో భోజనశాల నిర్మించారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలు యన్నమని లక్ష్మిపతి, చి ట్టూరి వెంకన్న, వాష్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ డైరెక్టర్‌ ఆనంద్‌లను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మార్గాని సత్యనారాయణ, కొండపల్లి పట్టియ్య, ప్రత్తిపాటి రామారావుచౌదరి, కంటిపూడి శ్రీను, గుర్రపు సత్యనారాయణ, మజ్జి పద్మ,చెల్లుబోయిన శ్రీను, ఐసీడీఎస్‌ పీడీ కె.విజయకుమారితోపాటు పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:38 AM