Share News

157 నీటితొట్టెల నిర్మాణం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:36 AM

జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు.

157  నీటితొట్టెల నిర్మాణం
పెరవలి మండలం ముక్కామలలో నీటితొట్టెల నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్న మంత్రి దుర్గేష్‌

15 మండలాల్లో ఏర్పాటు

పశువుల దాహార్తి తీర్చడమే లక్ష్యం

మంత్రి కందుల దుర్గేష్‌

పెరవలి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామాల్లో పశువుల నీటి తొ ట్టెల నిర్మాణానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. పశువుల తాగునీటి అవసరాలకు చేపట్టిన తొట్టెలకు నీటి కనెక్షన్‌ సంబంధిత గ్రామ పం చాయతీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ వెటర్నరి విభాగం పశువైద్య శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా 157 గ్రామాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మా ణం చేపట్టడం జరుగుతుందన్నారు. మండలాలు వారీగా చాగల్లు 10, దేవరపల్లి 10, గోపాలపురం 4, కొవ్వూరు 8, నల్లజర్ల 5, రాజానగరం 44, రంగంపేట 15, పెరవలి 18, తాళ్ళపూడి 5, నిడదవోలు 23, ఉండ్రాజవరం 15 చొప్పున నీటి తొట్టెల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎం. నాగ మల్లేశ్వరరావు, పీడీ ఆర్‌డీఏ ఎన్‌వీవీ ఎనహూర్తి, ఇతరఅధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమీక్ష

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర ్థవంతంగా అమలు చేయాలని మంత్రి కం దుల దుర్గేష్‌ ఆదేశించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులపై మంగళ వారం జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాం తి, జేసీ ఎస్‌.చి న్నరాముడు, అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతి నివేదికలు కూడా అందజే యాలన్నారు. నిడదవోలులో ఆర్‌వోబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నిడద వోలులో సమస్యలేమైనా ఉంటే అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఎర్రకా లువ పనుల పరిస్థితిపై కూడా చర్చించా రు. రానున్న సమావేశం నాటికి వివిధ శాఖలు నిర్దేశించుకున్న లక్ష్యాలతో నియోజకవర్గ ప్రణా ళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి మాట్లాడుతూ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:36 AM