AP Politics: నందిగం సురేష్‌కు బెయిల్.. ఏ కేసులో ఇచ్చారంటే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 06:30 PM
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ కేసులో సురేష్‌కు బెయిల్ లభించింది.. అసలే జరంగింది.. పూర్తి వివరాలు మీకోసం..

పల్నాడు, ఫిబ్రవరి 17: మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు సత్తెనపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అసలేం జరిగిందంటే.. రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేసిన మహిళలపై ఎంపీ నందిగం సురేష్ అసభ్యంగా ప్రవర్తించారు. 2020 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధిత మహిళ మండవ మహాలక్ష్మి అమరావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం అండదండలతో ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్ దిగిపోవడం.. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో సీన్ మారిపోయింది. వైసీపీ నేతలకు అండగా నిలిచిన పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్ ఇవ్వడంతో.. తప్పు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఈ క్రమంలోనే.. ఈ కేసులో సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు మాజీ ఎంపీ నందిగం సురేష్. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సివిల్ కోర్టు జడ్జ్.. సురేష్‌కు బెయిల్ మంజూరు చేశారు.
Also Read:
పార్లమెంటులో ఎంపీ అబద్ధం.. రూ. 9 లక్షల ఫైన్
సొంత ఇల్లు కట్టుకోవాలనుకొంటున్నారా.. మీకు బంపర్ ఆఫర్
కేక్‌లో క్రాకర్.. వెలిగించిన తర్వాత..
For More Andhra Pradesh News and Telugu News..