Amaravati Art Street: అమరావతి చిత్రకళా వీధి అబ్బురం.. అద్భుతం
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:53 AM
రాజమహేంద్రవరంలో జరిగిన అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన కళాప్రియులను మంత్రుముగ్ధులను చేసింది. సీఎం చంద్రబాబు తుది మెరుగులు దిద్దిన బుద్ధుని చిత్రపటాన్ని రూ.1,01,116కు కొనుగోలు చేయడం విశేషం.

కళాకారుల సృజనాత్మకత భేష్ .. ప్రదర్శన ప్రారంభోత్సవంలో రఘురామ
సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తాం: కందుల దుర్గేశ్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రదర్శనను అద్భుతంగా ఏర్పాటు చేశారని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. కళాకారుల సృజనాత్మకత అబ్బురమనిపిస్తోందన్నారు. శుక్రవారం మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఏర్పాటు చేసిన పెయింటింగ్స్, చెక్క బొమ్మ లు, విగ్రహాలు, వస్తువులను ఆసక్తిగా తిలకించారు. రఘురామ మాట్లాడుతూ.. సాంస్కృతిక శాఖ మంత్రిగా దుర్గేశ్‌ను, రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్‌గా తేజస్వి పొడపాటిని నియమించిన రోజునే రాష్ట్రంలో క ళలు, సంస్కృతికి మంచిరోజులు వచ్చాయనే నమ్మకం కలిగిందని, ఈ రోజు నిజమైందని అన్నారు. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాజమహేంద్రవరం రావాలని అనుకున్నారని, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో సంస్కృతి, అభివృద్ధిపరంగా పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మరోవైపు బీజేపీ నాయకత్వం కలిసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తేజస్వి పొడపాటి పేర్కొన్నారు.
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్, వివిధ ఆకృతులను తిలకించిన రఘురామకృష్ణరాజు.. సీఎం చంద్రబాబు తుది మెరుగులు దిద్దిన బుద్ధుని చిత్రపటాన్ని రూ.1,01,116కు కొనుగోలు చేశారు.
పులకించిన గోదావరి తీరం
అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనతో గోదావరి తీరం పులకించింది. సెంట్రల్ జైలు రోడ్డు వందలాది చిత్రపటాల తో పాటు మట్టి, ఫైబర్, కాగితం తదితర వస్తువులతో చేసిన ఆకృతులు, చెక్క శిల్పాలతో నిండిపోయింది. కాంచీపురం వాటర్ కలర్ పెయింటింగ్స్, ఫ్యాబ్రిక్ రద్దు నుంచి చేసిన ఉపకరణాలు, ఇసుక, చిరుధాన్యాలతో చేసిన ఆకృతులు, రావి ఆకులపై చరిత్రకారుల చిత్రాలు, నిర్మల్ పెయింటింగ్స్ ప్రదర్శించారు.