Andhra Pradesh: మూడేళ్ల బాలుడ్ని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదు
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:11 AM
ప్రాసిక్యూషన్ కఽథనం ప్రకారం నెల్లూరు జిల్లా నుంచి బేల్దారి పనులు కోసం వచ్చి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్లయ్యనగర్‌లో నివాసముంటున్న షేక్ ఖాదర్‌వలి నిత్యం భార్యను అనుమానిస్తుండేవాడు.

ఒంగోలుక్రైం, మార్చి20 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో మూడేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కఽథనం ప్రకారం నెల్లూరు జిల్లా నుంచి బేల్దారి పనులు కోసం వచ్చి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్లయ్యనగర్‌లో నివాసముంటున్న షేక్ ఖాదర్‌వలి నిత్యం భార్యను అనుమానిస్తుండేవాడు. కుమారుడు షాహుల్(3) తనకు పుట్టలేదంటూ భార్యను వేధిస్తుండేవాడు. 2018 నవంబరు 30న ఖాదర్ వలి మోటార్‌సైకిల్‌పై కుమారుడిని ఎక్కించుకొని బూదవాడ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేసి ఎర్రకొండలో పూడ్చివేశాడు. అతని భార్య సాల్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చీమకుర్తి పోలీసులు దర్యాప్తు చేశారు. ఖాదర్‌వలిని అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.వసుంధర వాదనలు వినిపించారు.