Share News

Forensic Team : జగన్‌ ఇంటి వద్ద క్లూస్‌ టీమ్‌ పరిశీలన

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:39 AM

జగన్‌ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ప్రాంతాన్ని శక్రవారం ఫోరెన్సిక్‌ ప్రత్యేక బృందం, జిల్లా క్లూస్‌ టీమ్‌ సభ్యులు పరిశీలించారు.

Forensic Team : జగన్‌ ఇంటి వద్ద క్లూస్‌ టీమ్‌ పరిశీలన

తాడేపల్లి టౌన్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్‌ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ప్రాంతాన్ని శక్రవారం ఫోరెన్సిక్‌ ప్రత్యేక బృందం, జిల్లా క్లూస్‌ టీమ్‌ సభ్యులు పరిశీలించారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గ్రీనరీ తగలబడిన విషయం విదితమే. కాగా, వైసీపీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు జరిగిన ఘటనపై తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు కేసు నమోదు చేశారు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌, నార్త్‌ జోన్‌ డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. ఫోరెన్సిక్‌, క్లూస్‌ టీమ్‌ సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, ల్యాబ్‌కు పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 05:39 AM