Share News

YS Avinash Reddy: అవినాశ్‌రెడ్డితో నాకు సంబంధాల్లేవ్‌!

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:29 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై ఉన్న ఆరోపణలను నిరూపిస్తే తల నరుక్కుంటానని ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు. సీబీఐ విచారణలో తనకు చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించారు.

YS Avinash Reddy: అవినాశ్‌రెడ్డితో నాకు సంబంధాల్లేవ్‌!

ఉన్నట్లు రుజువు చేస్తే తల నరుక్కుంటా వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టీకరణ

పులివెందుల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి డైరెక్షన్‌లో తాను యాక్షన్‌ చేస్తున్నానని అంటున్నారని.. ఆయనతో తనకు సంబంధాలు ఉన్నాయని గానీ.. ఆయనతో తాను టచ్‌లో ఉన్నట్లు గానీ నిరూపిస్తే తల నరుక్కుంటానని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పులివెందుల ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తనను తీవ్రంగా కొట్టారని.. సునీత, రాజశేఖర్‌రెడ్డి చిత్రహింసలు పెట్టారని పులివెందుల కోర్టులో ఇచ్చిన ప్రైవేట్‌ కంప్లయింట్‌ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. నాటి పులివెందుల సీఐ రాజు రెండు సార్లు తన వద్దకు వచ్చి 23 పేజీల స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తే.. ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి రికార్డు చేశారని రాశారని.. వారికేం సంబంధముందని ప్రశ్నించారు. ‘నన్ను కొట్టలేదని రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డి కాణిపాకంలో గానీ, తిరుపతిలో గానీ.. వారు చెప్పే ఏ చర్చిలో అయినా ప్రమాణం చేస్తే ప్రైవేట్‌ కంప్టయింట్‌ వెనక్కి తీసుకుంటా..’ అని స్పష్టంచేశారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:29 AM