Pancha Gramala Samasya: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:53 PM
Pancha Gramala Samasya: విశాఖపట్నం జిల్లాలోని సింహచలం పంచగ్రామాల సమస్య త్వరలో పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.

అమరావతి, జనవరి 29: విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కారిస్తామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం ముఖ్య నేతలతోపాటు రెవెన్యూ, దేవాదాయ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఈ రోజు కీలక సమీక్ష నిర్వహించారన్నారు.
ఆ క్రమంలో చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఉన్నతాధికారులందరితో మాట్లాడారని తెలిపారు. అందులోభాగంగా సింహచలం పంచ గ్రామాల సమస్యపై పరిష్కారాన్ని ఆయన సూచించారని వివరించారు.
అయితే దీనిపై లీగల్ ఓపీనియన్‌ను తీసుకోని కేంద్ర మాజీ మంత్రి పి. అశోక్ గజపతిరాజు అనుమతితో ప్రత్యమ్నాయంగా భూమి ఇచ్చి.. తద్వారా 12 వేల నివాసాలను రెగ్యూలరైజ్ చేసే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వేళ్తోందన్నారు. 70 వేల మందికి మంచి జరిగేలా 296 జీవోను గతంలో టీడీపీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకోంటుందని తెలిపారు.
0 నుంచి 150 యార్డ్ ఉన్న వాటికి ఎలా అయితే రెగ్యులరైజ్ చేస్తున్నామో.. అదే విధంగా పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ విపులీకరించారు. ఇక పాత తేదీ ప్రకారం పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గాజువాక ప్రాంతంలో గతంలో 301 జీవో ఇవ్వడం వల్ల 2018 నుండి ఈ ఇష్యూ నడుస్తోందని గుర్తు చేశారు.
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
ఆ జీవోను సైతం సవరించి వారికి కూడా న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మిగలిన ప్రాంతాల్లో ఈ తరహా జఠిలమయిన సమస్యలను సైతం పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News