Share News

రబీ సాగు సౌందర్యం

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:47 PM

వర్షాలు కురుస్తూ పచ్చని పంటలతో ఖరీఫ్‌ సీజన్‌లో ఆకర్షణీయంగా కనిపించడం సహజం. కానీ పచ్చదనం ఎండి పోయి ప్రకృతి కళావిహీనంగా దర్శనమిచ్చే రబీ సీజన్‌లోనూ మన్యంలో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

రబీ సాగు సౌందర్యం
పాడేరు మండలం బందపొలం ప్రాంతంలో పచ్చని దృశ్యం

పాడేరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి):

వర్షాలు కురుస్తూ పచ్చని పంటలతో ఖరీఫ్‌ సీజన్‌లో ఆకర్షణీయంగా కనిపించడం సహజం. కానీ పచ్చదనం ఎండి పోయి ప్రకృతి కళావిహీనంగా దర్శనమిచ్చే రబీ సీజన్‌లోనూ మన్యంలో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సాగునీటి వసతి ఉన్న ప్రదేశాల్లో ప్రస్తుతం రబీ వరి పంటను పండిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పచ్చదనంతో ప్రకృతి సౌందర్యం ఆకట్టుకుంటున్నది. అటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలను పాడేరు మండలం బందపొలం, కందమామిడి ప్రాంతాల్లో ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌ మనిపించింది.

Updated Date - Mar 23 , 2025 | 10:47 PM