మండుతున్న ఎండలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:42 PM
మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కొయ్యూరులో 35.3 డిగ్రీలు
పాడేరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయట సంచరించేందుకు జనం భయపడుతున్నారు. కొయ్యూరులో ఆదివారం 35.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 34.6, జీకేవీధిలో 31.1, జి.మాడుగుల, హుకుంపేట, అరకులోయలో 309, ముంచంగిపుట్టులో 30.7, అనంతగిరిలో 30.5, చింతపల్లిలో 30.4, డుంబ్రిగుడలో 30.3, పెదబయలులో 30.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.