Iftar Event: నేడు విజయవాడలో ఇఫ్తార్
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:25 AM
రంజాన్ మాసం సందర్భంగా మార్చి 27న విజయవాడలో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.75 లక్షలు మంజూరు చేసింది. జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ కోసం రూ.1.50 కోట్లు కేటాయించిందని మంత్రి ఎన్.ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు... 75 లక్షలు కేటాయింపు
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని విజయవాడలో గురువారం రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. బుధవారం ఇఫ్తార్ వేదిక... ఏ ప్లస్ కన్వెన్షన్ వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ సీఈవో శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర స్థాయిలో ఇఫ్తార్‌కు రూ.75 లక్షలు మంజూరు చేసింది. ఈ నెల 27, గురువారం విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.’ అని మంత్రి ఫరూక్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..