Group 2 Exam: గ్రూప్2 అభ్యర్థుల్లో గందరగోళం.. అసలు కారణమిదే
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:33 PM
Group 2 Exam:గ్రూప్2 పరీక్ష నిర్వహణపై ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడంపై అభ్యర్ధులు విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: గ్రూప్2 పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రోజుల పాటు పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ రాసిన లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై కోర్టులో వేసిన పిటిషన్ మార్చి11వ తేదీన విచారణ ఉన్నందున అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రేపు(ఫిబ్రవరి 23)న జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించినా ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో ఏపీపీఎస్సీ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గ్రూప్ 2 మెయిన్స్‌పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై ఏపీపీఎస్సీకి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్‌లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను ప్రభుత్వం అర్థం చేసుకుంది.
రోస్టర్ సమస్యను, అభ్యర్థుల న్యాయబద్ధమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖలో తెలిపింది. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ వర్గాలు స్పందించలేదు. లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించినా ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
Read Latest AP News And Telugu News