AP News: విషాదం.. అన్న మృతిని తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె
ABN , Publish Date - Jan 15 , 2025 | 12:18 PM
Andhrapradesh: చీరాల గొల్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తరువాత ఒకరు అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంగాధర్ (40), గోపి (33) ఇద్దరు అన్నదమ్ములు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే గంగాధర్ ఎంతో ఉషారుగా వడ్రంగి పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ గంగాధర్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు.

బాపట్ల, జనవరి 15: ఆ అన్నదమ్ములిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. రక్తం పంచుకుపుట్టిన ఇద్దరు ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉన్నారు. అన్ని వేడుకలను కలిసే చేసుకుంటున్నారు. అన్నదమ్ములు ఒక్కతాటి పైనే ఉంటారు. అన్న మాట జవదాటడు ఆ తమ్ముడు. పెళ్లిళ్లు అయినప్పటికీ అంతా ఒకే చోట ఉంటూ ఉమ్మడి కుటుంబంగా ఆనందాలు పంచుకుంటారు. సంక్రాంతి పండుగను కూడా వారు ఎంతో సరదాగా జరుపుకున్నారు. ఇంత అన్యోన్యంగా కలిసున్న వీరిని చూసి విధికి కూడా ఈర్ష కలిగిందేమో. ఒక్కసారిగా వారి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.
తోడబుట్టిన సోదరులు ఇద్దరు కలిసి జీవించారు.. ఇప్పుడు కలిసే ప్రాణాలు విడిచారు. అన్న మరణవార్తను తట్టులేకపోయింది ఆ తమ్ముడి గుండె. నీతో పాటే నేను అంటూ అన్నతో పాటే తమ్ముడు కూడా అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అన్న ఎలా చనిపోయాడు... అన్నను గురించిన విషయం తెలిసిన తమ్ముడు ఎలా కృంగిపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జిల్లాలోని చీరాల గొల్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తరువాత ఒకరు అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంగాధర్ (40), గోపి (33) ఇద్దరు అన్నదమ్ములు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే గంగాధర్ ఎంతో ఉషారుగా వడ్రంగి పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ గంగాధర్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని తోటి వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటి అతడు గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అప్పటికే అన్న పడిపోయిన విషయం తెలుసుకున్న గోపి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాడు. దీంతో గంగాధర్ చనిపోయిన విషయాన్ని తమ్ముడు గోపికి వైద్యులు తెలియజేశారు. దీంతో గోపి షాక్ గురయ్యాడు. అన్న మృతిని తమ్ముడు తట్టుకోకపోయాడు. తీవ్ర మనోవేదనతో గోపీ కూడా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని పరీక్షించిన వైద్యులు గోపీ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. అన్నదమ్ములు ఒకేసారి గుండెపోటుతో మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండగ వేళ ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
సీఎం చంద్రబాబు నిర్ణయంతో కౌలు రైతుల హర్షం..
Supreme court: సుప్రీంలో చంద్రబాబుకు భారీ ఊరట
Read Latest AP News And Telugu News